Lavanya Tripathi : పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఇంత గ్లామర్ ఒలకబోస్తుంది ఏంటి.. పిచ్చెక్కిపోవడం ఖాయం..!
Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో […]
Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
Lavanya Tripathi : అందం అంటే ఇది కదా..
ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉంటే లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో గ్లామరస్ షోతో రచ్చ చేస్తుంటుంది. ఈ భామ అందాల అరాచకం మాములుగా ఉండదు. తాజాగా పింక్ కలర్ చీర కట్టి, మ్యాచింగ్ చెవి దిద్దులు పెట్టుకుని చిరు మందహాసం తో చూపరుల దృష్టిని ఆకర్షించింది. చీర కట్టు లో లావణ్య త్రిపాఠి ని చూస్తూ ఉంటే ఎవరు కళ్లప్పగించి చూడకుండా ఉండలేకపోతన్నారు.
ఇలా నిన్ను చూసి మైమరిచిపోతున్నాం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే లావణ్య త్రిపాఠి తన ఫొటోలకి చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మ యొక్క పింక్ చెవి దిద్దులు లు ధరించాను. నేను ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. ఇకపై ఇవి నావే అంటూ చాలా సంతోషంగా లావణ్య త్రిపాఠి కామెంట్ పెట్టింది.తల్లి చెవి దిద్దులను పెట్టుకున్న లావణ్య త్రిపాఠి మురిసిపోవడం చూసి నెటిజన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. తల్లిపై లావణ్య కు ఉన్న అభిమానం మరియు ప్రేమ ఇందులో కనిపిస్తున్నాయి అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక లావణ్య త్రిపాఠి భర్త వరుణ్ తేజ్ విషయానికి వస్తే వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.