Laya : బాలయ్యకు చెల్లి అనే సరికి వెక్కివెక్కి ఏడ్చిన లయ.. ఎందుకో తెలుసా?
Laya : ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించిన లయ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన లయ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. తెలుగు సినిమా పాటలకు చిందులేస్తూ తెగ హంగామా సృష్టిస్తుంది. లయకు సంబంధించిన ఏ వీడియో అయిన క్షణాలలో వైరల్ అవ్వాల్సిందే. అయితే లయకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. లయ స్వస్థలం విజయవాడ. ఆమె అక్కడే నలంద కాలేజ్‌లో చదివింది.
తర్వాత టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించిన లయ ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాక అమెరికాలో ఉండే ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. వివి వినాయక్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా 2002లో వచ్చిన సినిమా చెన్నకేశవరెడ్డి. ఈ సినిమాలో శ్రీయ, టబు హీరోయిన్లుగా నటించారు. బాలయ్యకు సోదరిగా ఒకప్పటి హీరోయిన్ దేవయాని నటించింది. అయితే ఈ సోదరి పాత్ర కోసం దర్శకుడు వినాయక్ ముందుగా హీరోయిన్ లయను కలిసి కథ చెప్పారట. బాలయ్య చెల్లి పాత్రకు మీ పేరు పరిశీలిస్తున్నామని వినాయక్ చెప్పడంతో లయ కాస్త అసహనం వ్యక్తం చేయడంతో పాటు భోరున ఏడ్చేసిందట. ‘ఏంటండి తెలుగు అమ్మాయిలను సిస్టర్ పాత్రలకే ఎందుకు అడుగుతారు.
Laya : లయ కన్నీరు…
హీరోయిన్‌గా పనికి రారా’ అన్నారు. దానికి నేను ‘మీరు చూడటానికి అమాయకంగా నేను అనుకున్న పాత్రకు సూట్ అవుతారనిపించి వచ్చాను’ అని చెప్పాను. ‘తెలుగు అమ్మాయిలను ఎందుకలా చూస్తారు? హీరోయిన్‌గా ఎందుకు ఛాన్స్ ఇవ్వరు?’ అని కన్నీళ్లతో లయ ప్రశ్నించే సరికి నా దగ్గర సమాధానం లేదు. ‘సారీ అమ్మా! ఏమీ అనుకోకండి ప్లీజ్’ అని చెప్పి వచ్చేశాను అని వివి వినాయక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో బాలయ్యను ద్విపాత్రాభినయంలో ఒక వైపు ఫ్యాక్షన్ లీడర్.. మరో వైపు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆవిష్కరించారు వినాయక్.