Laya : ల‌య కూతురు అచ్చం త‌ల్లిని దింపేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Laya : ల‌య కూతురు అచ్చం త‌ల్లిని దింపేసిందిగా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 August 2022,6:40 pm

Laya : ఒక‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలిచిన ల‌య ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా ద్వారా తెగ సంద‌డి చేస్తుంది. ప్రేమించు సినిమాలో అంధురాలి పాత్రలో ఆమె అభినయానికి ఏకంగా నంది పురస్కారం వరించింది. ఇదే కాకుండా మిస్సమ్మ, హ‌నుమాన్ జంక్షన్‌, శివరామరాజు, స్వరాభిషేకం తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది ల‌య‌. సిల్వర్‌స్ర్కీన్‌పై స‌త్తా చాటుతున్న స‌మ‌యంలోనే ల‌య ఎన్నారైని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం కాలిఫోర్నియాలో సెటిలైంది.

Laya : త‌ల్లి పోలిక‌ల‌తో..

ల‌య వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లయ కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది. అలాగే తన ఇద్దరి పిల్లల ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌లో పంచుకుంటోంది. ఇక సినిమా పాటలకు ఆమె వేస్తున్న డ్యాన్స్‌ లు నెట్టింట్లో బాగా వైరలవుతున్నాయి. రాఖీ పండుగ సంద‌ర్భంగా ల‌య ఇంట జ‌రిగిన‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించి ఓ బ్యూటిఫుల్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇందులో లయ కూతురు శ్లోకా తన తమ్ముడికి రాఖీ కట్టడం మనం చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.

laya daughter pics viral

laya daughter pics viral

శ్లోకా అచ్చుగుద్దినట్లు లయలానే ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రేమించు, మిస్స‌మ్మ‌, హ‌నుమాన్ జంక్ష‌న్‌, స్వ‌రాభిషేకం వంటి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది . 2010లో విడుదలైన బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది లయ. ఆతర్వాత మళ్లీ మూడేళ్ల క్రితం రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఓ చిన్నపాత్రలో నటించింది. ల‌య ఎప్పుడు చూడ చ‌క్క‌ని అందంతో అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. ఈ అమ్మ‌డు ఏ పోస్ట్ పెట్టిన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Laya Gorty (@layagorty)

Advertisement
WhatsApp Group Join Now

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది