Laya : జాత‌కాలు కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే టాలీవుడ్ హీరోని ల‌య పెళ్లి చేసుకోలేదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Laya : జాత‌కాలు కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే టాలీవుడ్ హీరోని ల‌య పెళ్లి చేసుకోలేదా?

 Authored By sandeep | The Telugu News | Updated on :6 September 2022,4:30 pm

Laya : ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ల‌య పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది. ఫ్యామిలీ బాగోగుల‌ని చూసుకుంటూ కాలం గ‌డుపుతుంది. ల‌య సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూరం అయ్యి చాలా ఏళ్లు అవుతుంది. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ అదరగోడుతోంది. నెట్టింట మాత్రం ఏదో అప్‌డేట్‌ ఇస్తూ.. ఫ్యాన్స్ కు ట‌చ్‌లో ఉంటుంది. కాలిఫోర్నియలో ఉంటున్న ఈ మాజీ హీరోయిన్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుగు సినిమాల పాట‌ల‌కు సంబంధించి వైవిధ్యంగా డ్యాన్స్‌లు చేస్తూ అద‌ర‌గొడుతుంది. ల‌య డ్యాన్స్ చేసిందంటే ఆమె అభిమానుల‌తో పాటు నెటిజన్స్ కూడా ఫిదా కావ‌ల్సిందే మ‌రి.

అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసింది అందాల తార లయ.. స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ల‌య అప్ప‌ట్లో ప్రేమించు అనే సినిమాలో అద్భుతంగా న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందిన విష‌యం తెలిసిందే. ఇందులో సాయికిరణ్ కు టాలీవుడ్ బ‌డా నిర్మాత‌ డాక్టర్ డి రామానాయుడు హీరోగా న‌టించే అవకాశం ఇచ్చారు. ఇందులో సాయి కిర‌ణ్‌, ల‌య కెమిస్ట్రీ అద్భుతంగా అనిపించింది. చాలా మంది కూడా వీరి ప‌ర్‌ఫార్మెన్స్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. అయితే సాయి కిర‌ణ్ రాను రాను కుర్ర హీరోల పోటీ తట్టుకోలేక బుల్లితెర హీరోగా మారిపోయి సీరియల్స్ తో అలరించడం మొదలుపెట్టాడు.

laya missed the Hero Sai Kiran due to this

laya missed the Hero Sai Kiran due to this

Laya : జాత‌కాల వ‌ల్ల‌..

అయితే సాయి కిర‌ణ్‌, ల‌య అప్ప‌ట్లో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. సాయికిరణ్ తల్లిదండ్రులు, ఇటు లయ తల్లిదండ్రులు కూడా ఇద్దరు భార్యాభర్తలు అయితే బాగుంటుందని అనుకున్నారట. అయితే జాతకాలు కుదరక పోవడంతో ఈ పెళ్లి జరగలేదని.. అంతకుమించి మరో కారణం లేదని సాయికిరణ్ చెప్పాడు. అయితే ఆ తర్వాత కూడా మేమిద్దరం కలిసి ఒక సినిమాలో నటించామని తెలిపాడు. ఇక ఇప్పటికీ మా మధ్య మంచి స్నేహం ఉందని సాయికిరణ్ చెప్పాడు. తమ కుటుంబంలో జాతకాలను ఎక్కువగా నమ్ముతారని, అలాగే తాను కూడా జాతకాలను బాగా నమ్ముతాన‌ని సాయికిరణ్ చెప్పాడు. సాయికిరణ్ గొప్ప శివ భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఇక ల‌య అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ ను పెళ్లి చేసుకుని కాలిఫోర్నియాలో ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది