Chandrabose : చంద్రబోస్ భార్య మరీ ఇంత దారుణమా?.. స్టేజ్ మీద రచ్చ రచ్చే!
Chandrabose బుల్లి తెరపై పండుగలకు స్పెషల్ ఈవెంట్లు రావడంతో ఈ మధ్య కామన్ అయిపోయింది. ఒకరిని మించి మరొకరు చేయాలనే పోటీతత్త్వంతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈటీవీ,స్టార్ మా, జీ తెలుగు చానెల్స్ ఇలా ఈవెంట్లు చేయడంలో ముందుంటున్నారు. అయితే ఈ స్పెషల్ ఈవెంట్లకు సెలెబ్రిటీలను తీసుకురావడమే చాలెంజింగ్‌గా మారింది. ఏ చానెల్ సెలెబ్రిటీలు ఆ చానెల్ ఈవెంట్లలోనే వస్తుంటారు.
చంద్రబోస్ భార్య మరీ ఇంత దారుణమా?.. స్టేజ్ మీద రచ్చ రచ్చే! Chandrabose
ఉదాహరణకు జీ తెలుగు ఈవెంట్ అంటే చంద్రబోస్, సింగర్ యశస్వి కొండెపూడి, జీ తెలుగు సీరియల్ నటీనటులు వస్తుంటారు. అలా ఈ వినాయక చవితికి స్వామి వారి సంబురాలు తగ్గేదేలే అంటూ శ్రీముఖి దుమ్ములేపేసేందుకు వచ్చింది. ఇందులో భాగంగా సింగర్ రేవంత్, సింగర్ యశ్వంత్ తన లవర్ జానుతో కలిసి వచ్చాడు. ఇక చంద్రబోస్ తన భార్యను తీసుకొచ్చాడు.
చంద్రబోస్ తెరపై ఎంత సైలెంట్‌గా ఉంటాడో.. ఆయన భార్య దానికి వ్యతిరేకంగా ఉన్నారు. స్టేజ్ మీద దుమ్ములేచిపోయేలా డ్యాన్స్ చేసింది. రంగమ్మ మంగమ్మ అంటూ చంద్రబోస్ రాసిన పాటకే ఆయన భార్య గంతులు వేసింది. ఆమె స్పీడుకు అందరూ షాక్ అయ్యారు. భార్యలు గొప్పా? భర్తలు గొప్పా? అని చంద్రబోస్‌ను అంటే.. మా ఆవిడను అడిగి చెబుతాను అని తెలివిగా తప్పించుకున్నాడు.
