Maa Oori Polimera 2 Movie Public Talk : మా ఊరి పొలిమేర 2 మూవీ పబ్లిక్ టాక్.. ట్విస్టులు తట్టుకోలేం భయ్యా అంటున్న ప్రేక్షకులు
ప్రధానాంశాలు:
మా ఊరి పొలిమేర 2 హిట్ అంటున్న ప్రేక్షకులు
ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదంటున్నారు
ట్విస్టులు మాత్రం అదుర్స్
Maa Oori Polimera 2 Movie Public Talk : ఏ సినిమాకు అయినా ట్విస్టులు ప్రాణం. ఒక సినిమాలో కథను మలుపు తిప్పేది కూడా ట్విస్టులే. ఏ ట్విస్టూ లేకుంటే సినిమా చప్పగా ఉంటుంది. చూసే జనాలకు కూడా ఇంట్రెస్ట్ రాదు. సినిమా అయిపోక ముందే మధ్యలోనే లేచి వెళ్లిపోతారు. 2 లేదా 3 గంటలు ఒక ప్రేక్షకుడిని థియేటర్ లో సీటు నుంచి లేవకుండా కట్టి పడేసేలా ఉండాలి ఏ సినిమా అయినా. అప్పుడే ఆ సినిమా సక్సెస్ అయినట్టు. ప్రేక్షకుడు బయటి విషయాలన్నీ మరిచిపోయి కేవలం ఆ సినిమా మీదనే దృష్టి పెట్టాలి. ఆ సినిమా తప్ప మరో ప్రపంచం ప్రేక్షకుడికి కనిపించకూడదు. అలాంటి కథలు అంటే ఖచ్చితంగా హార్రర్, త్రిల్లర్, యాక్షన్, కామెడీ మూవీస్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
తాజాగా ఇవాళ రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా అలాంటిదే. హార్రర్, త్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని చూసిన ప్రేక్షకులు అయితే.. బాబోయ్ ఆ ట్విస్టులు ఏంటి భయ్యా తట్టుకోలేకపోయాం అంటున్నారు. సినిమా పిచ్చెక్కించింది అంటున్నారు. మొదటి పార్ట్ ఇప్పటికే ఓటీటీలో దుమ్ములేపింది. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా మా ఊరి పొలిమేర 2 వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఫ్యాన్స్ కోసం వేశారు. ఆ సినిమా చూసిన ఫ్యాన్స్ అస్సలు ఆగడం లేదు. ఇదేం సినిమా భయ్యా.. పిచ్చెక్కించింది. అవేం ట్విస్టులు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇవాళ మొత్తం ఈ సినిమానే ట్రెండింగ్ టాపిక్. సినిమా చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. మొదటి పార్ట్ కు మించి రెండో పార్ట్ ఉందని.. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమా అయితే రాలేదు. కథ మాత్రం అద్భుతం అంటున్నారు.
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా సత్యం రాజేష్ ఇరగదీశాడంటున్నారు. స్క్రీన్ ప్లే కూడా అదిరిపోయిందంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో రివీల్ చేయని చాలా అంశాలను, చాలా ట్విస్టులను సెకండ్ పార్ట్ లో చూపించారు. సెకండ్ పార్ట్ లో ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేయడం అద్భుతంగా ఉంది, డైరెక్షన్ వేరే లేవల్ అంటున్నారు ప్రేక్షకులు. రెండు గంటలు ప్రేక్షకుడు ఏమాత్రం బోర్ ఫీల్ అవకుండా ఈ సినిమాను సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తాడని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్స్ అంటున్నారు.