Maadhavi Latha : ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాధవి లత..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maadhavi Latha : ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాధవి లత..!

 Authored By aruna | The Telugu News | Updated on :17 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Maadhavi Latha : ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాధవి లత..!

Maadhavi Latha : టాలీవుడ్ నటి మాధవి లత గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తను అనుకున్నది సోషల్ మీడియాలో చెబుతూ కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకుంటారు. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో యాంకర్ మాధవిలతను సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ నేను ఇటీవల ‘ ఆదిపురుష్ ‘ సినిమాను చూశాను.

అది ఒక బ్లండర్, డిజాస్టర్, డర్టీ మూవీ. హిందువులను డివైడ్ చేయడానికి మాత్రమే ఈ సినిమాను చేశారు అని ఆమె అన్నారు. ఈ సినిమాలో రావణుడిని అలా చూపిస్తారా, సీతను దెయ్యంలా తీసుకెళ్తాడా, ఈ తరం పిల్లలకు ఈ సినిమా చూశాక ఓ రావణుడు ఇలా ఉంటాడా, సీత ఇలా ఉంటుందా అని అనుకుంటారు. యానిమేషన్ ఉపయోగించి ఆదిపురుష్ సినిమాను చెత్తగా చేశారు అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ స్టార్ హీరోల చేత గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి చెప్పడం మంచి కాన్సెప్ట్ కానీ హీరోయిన్ గ్లామర్ గా చూపిస్తూ , ఎలాంటి డైలాగ్స్ చెప్పకూడదు.

అలా చేస్తే .. చేసేది శివ పూజలు దూరేది ఇంకేదో అంటారు కదా అలా ఉంటుంది. ఇక సినిమాలో డైలాగ్స్ చెప్పేవాళ్లు నిజ జీవితంలో కూడా పాటిస్తే బాగుంటుంది అని ఆమె సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇంకా ఆమె సమంత గురించి కూడా రియాక్ట్ అయ్యారు. ఈ సమాజం హీరో, హీరోయిన్ విడాకులు తీసుకుంటే హీరోయిన్ ని వేలెత్తి చూపిస్తారు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ విడాకులు తీసుకుంటే వాళ్ళ నాన్న మంచి వాడు కాదని, మా అమ్మ కష్టాలు పడ్డదని అంటారు. కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం జడ్జ్ చేస్తారు అని ఫైర్ అయ్యారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది