Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు వీజే సన్నీకి మాధవి లత వార్నింగ్ .. చెంప పగలగొడతా.. తాట తీస్తా అంటూ హెచ్చరికలు..!
Bigg Boss 5 Telugu : నటి, బీజేపీ నేత మాధవీ లత సినిమా అవకాశాలు లేకపోయినా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల బిగ్ బాస్ షో పై వరుస రివ్యూలు ఇస్తూ హౌజ్ లో షణ్ముఖ్ వ్యవహారం పట్ల రచ్చ రచ్చ చేసిన మాధవి లత.. తాజాగా టైటిల్ విన్నర్ వీజే సన్నిపై విరుచుకు పడింది. ఉన్నట్టుండి లైవ్ లోకి వచ్చిన ఈ అమ్మడు.. ఎవరూ ఊహించని విధంగా అతనిపై రెచ్చి పోయింది. సన్నీ… నీ కళ్ళు నెత్తి కెక్కాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వీజే సన్నీ ఇంతలా ఆమె ఆగ్రహానికి గురవడానికి కారణం ఏంటో మనమూ తెలుసుకుందాం రండి.భారీ ఓటింగ్ తో బిగ్ బాస్ 5 టైటిల్ ను తన సొంతం చేసుకున్న సన్నీ బయటకు వచ్చిన అనంతరం బడా ఛానెళ్లలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయాడు.
అయితే హౌజ్ లో ఉన్నప్పుడు తనకు ఓట్లు వేసి గెలిపించాలని కోరిన సన్నీ.. ఇప్పుడు గెలిచిన తర్వాత అసలు ప్రేక్షకులని పట్టించుకోవడమే మరిచి పోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాన్ పేజీలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల వంక అసలు అతను తలెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మాధవి లత తనదైన శైలిలో స్పందించారు.విన్నర్‌గా నిలిచిన సన్నీకి గర్వం తలకెక్కిందన్నారు. సన్నీ గెలుపు కోసం శ్రమించిన ఫ్యాన్ పేజీలను వదిలేసి, ఓట్లు వేయడానికి వాళ్లు పడ్డ కష్టాన్ని పట్టించుకోకుండా బడా టీవీ ఛానళ్లకు, ఎక్కువ ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని విరుచుకు పడింది.

madhavi latha fires on bigg boss 5 Telugu winner vj sunny that he dint care fans
Bigg Boss 5 Telugu : ఫ్యాన్స్ ను గుర్తు పెట్టుకో.. తాట తీస్తా..!
ప్రేక్షకుల పట్ల కృతజ్ఞతాభావం లేనివాళ్లంటే తనకు చిరాకు అంటూ తను తప్పు చేస్తున్నాడని వివరించింది. సన్నీ గెలుపు కోసం బయట నుంచి ఫ్యాన్ పేజీల వాళ్ళు, యూటూబర్లు ఎంత కష్ట పడ్డారో అతని ఫ్రెండ్స్ కైనా గుర్తుందా? వాళ్ల కళ్లు ఏమైనా నెత్తికెక్కాయా ? అంటూ నిలదీసింది. సన్నీ పీఆర్ ఫ్రెండ్ ఎవరో తనకు కనిపిస్తే అతని చెంప పగలగొడతానని ఫైర్ అయింది. సాధారణ జనానికి విలువివ్వకపోతే నువ్వు అక్కడే ఆగిపోతావని గుర్తుంచుకో అంటూ సన్నికి సూచించింది. ఏ పెద్ద మీడియాలో అయితే కనబడుతున్నావో అక్కడే నిన్ను నిలబెట్టి కడిగేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. తనకు ఎవరైనా నచ్చితే నెత్తిన పెట్టుకుంటాను అంటూ.. అలాగే తిక్కలేస్తే వారి తాట తీసి పారేస్తా అని సన్నీకి ఇన్ డైరెక్ట్ గా ఓ వార్నింగ్ ఇచ్చింది.