Madhavi Latha : ఏపీ హోం మంత్రిపై మాధవిలత ఫైర్.. అడుక్కుంటే భిక్ష వేస్తారంటూ..!
Madhavi Latha : ఏపీ హోం మంత్రి అనిత పై హీరోయిన్ బీజేపీ నేత మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వినాయక చవితి జరుగుతున్న ఈ వేడుకల్లో ఏపీ హోం మంత్రి పండగ ఏర్పాట్ల అనుమతి విషయంలో కొన్ని కండీషన్స్ ఏర్పాటు చేశారు. పండగ టైం లో మండపాలు, విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం సింగి విండో విధానం ప్రవేశ పెట్టింది. ఐతే దీనిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే […]
ప్రధానాంశాలు:
Madhavi Latha : ఏపీ హోం మంత్రిపై మాధవిలత ఫైర్.. అడుక్కుంటే భిక్ష వేస్తారంటూ..!
Madhavi Latha : ఏపీ హోం మంత్రి అనిత పై హీరోయిన్ బీజేపీ నేత మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా వినాయక చవితి జరుగుతున్న ఈ వేడుకల్లో ఏపీ హోం మంత్రి పండగ ఏర్పాట్ల అనుమతి విషయంలో కొన్ని కండీషన్స్ ఏర్పాటు చేశారు. పండగ టైం లో మండపాలు, విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం సింగి విండో విధానం ప్రవేశ పెట్టింది. ఐతే దీనిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే టైం లో దీనిపై నటి, బీజేపీ నాయకురాలు మాధవి లత ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం వినయక చవితి కారణంగా మైక్ పర్మిషన్ కోసం 100 రూ.లు, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకు హైట్ ని బట్టి చలాన్ లు కట్టాలని హోమంత్రి అనిత చెప్పారు. దీనిపై ఘాటుగా స్పందించారు మాధవిలత. అనితక్కా ఏంటక్కా మీ తిక్క అంటూ ఫైర్ అయ్యారు. అందరికీ హిందువిల పండగల మీద చిల్లర ఏరుకోవడం పని అయ్యిందని మండపాల వద్ద అడుక్కుంటే భిక్షం వేయడానికి వినాయక భక్తులు సిద్ధం అని ఆమె ఫైర్ అయ్యారు.
Madhavi Latha రాజకీయాలకంటే హిందూ ధర్మం ముఖ్యమని..
మిగతా మతస్తుల పండగలకు ఎలాంటి కండీషన్లు పెట్టరు. ఫస్ట్ వాళ్లకు పెట్టి ఆ తర్వాత హిందువులకు పెట్టండని ఆమె అన్నారు.ఏపీలో ఉన్నది తమ ప్రభుత్వమే అయినా తనకు రాజకీయాలకంటే హిందూ ధర్మం ముఖ్యమని అన్నారు. అనితక్కా ఏంది మీ తిక్కా.. ఔనక్కా మొన్న చిన్నపిల్లని మాన భంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు..? ఉయ్యాల్లో ఉన్న బిడ్డను ముసలోడు మాన భంగం చేశాడు.. ఆ ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా.. ఓహో మేమిచ్చే భిక్షతోనే లాయర్ ని పెడతారా అంటూ అనిత పై పరోక్షంగా భారీగా ఫైర్ అయ్యారు మాధవిలత.
అడుక్కుంటే భిక్ష వేయడానికి వినాయక భక్తులు, హిందూ బంధువులు సిద్ధంగా ఉన్నారని.. మా వినాయకుడికి ఆకలి ఎక్కువే అయినా ఆయన కోసం వండే వంటలు తగ్గించి మీకు నాలుగు వేస్తారు ఏముంది మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే మీ పన్ సమాన న్యాయం.. సమాన ధర్మం పెట్టండి మా వినాయకుడి మండపాలకు విగ్రహం ఎత్తుకు డబ్బులు ఎందుకు కట్టాలని అమె ప్రశ్నించారు. గణేష్ మండపాలకు మైక్ కోసం రోజుకి 100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులు అయితే 350, అంతకన్నా ఎక్కువ ఉంటే 700 చలానా కట్టాలని ఏపీ మంత్రి అనిత అన్నారు.