Unstoppable : ఒకే ఫ్రేంలో బాలకృష్ణ, మహేశ్ బాబు.. బ్లాక్ బాస్టర్ ఎపిసోడ్.. టెలికాస్ట్ అయ్యేదెప్పుడంటే?
Unstoppable : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకే ఫ్రేంలో కనబడబోతున్నారు. సినిమాలో కాదండోయ్.. బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘ఆహా’, ‘అన్‌స్టాపెబుల్’ షోలో .. ఇటీవల ఈ షోకు గెస్ట్‌గా మహేశ్ బాబు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా, ఎపిసోడ్ టెలికాస్ట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వారు అప్ డేట్ ఇచ్చారు.
నందమూరి నటసింహం బాలయ్య ‘అన్ స్టాపెబుల్’షో లో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అతిథులుగా హాజరయ్యారు. కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ షోకు హాజరయ్యారు. బాలయ్య షోలో హాజరైనందుకు చాలా ఆనందంగా ఉందని ఇప్పటికే మహేశ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా, షోలో బాలయ్య మహేశ్ బాబును ఏయే ప్రశ్నలు వేశారు. వాటికి మహేశ్ ఏం సమాధానాలు ఇచ్చారు..అనేది తెలియాలంటే కంప్లీట్ ఎపిసోడ్ చూడాల్సిందే.త్వరలో ఈ బ్లాక్ బాస్టర్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని ‘ఆహా’ వారు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

mahesh babu and balakrishna one frame in unstoppable show
Unstoppable : అభిమానులకు పండుగే..
దాంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఫ్రేంలో మహేశ్, బాలయ్యను చూసే అదృష్టం తమకు కలుగుతుందని అంటున్నారు. ఇక వీరిరువురి సినిమాల విషయానికొస్తే.. బాలయ్య ‘అఖండ’ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. మహేశ్ నటించిన ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది.