Mahesh Babu Birthday : 15 ఏళ్ల తర్వాత వచ్చిన ‘పోకిరి’ కి నమోదైన వసూళ్లు ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh Babu Birthday : 15 ఏళ్ల తర్వాత వచ్చిన ‘పోకిరి’ కి నమోదైన వసూళ్లు ఎంతో తెలుసా?

Mahesh Babu Birthday : ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సినిమా హీరోలకు అభిమానులు మన దేశంలో ఉంటారు. మన దేశంలో కూడా అత్యధికంగా హీరోలను అభిమానించేది కేవలం తమిళ మరియు తెలుగు ప్రేక్షకులు మాత్రమే. తెలుగు మరియు తమిళ హీరోలకు తప్ప మరెక్కడ కూడా ఈ స్థాయి అభిమానులు ఉండరు అనడంలో నూటికి నూరు శాతం నిజం. అభిమానం పేరుతో అభిమానులు లక్షలు.. కోట్ల రూపాయలను హీరోలకు మరియు వారి వారి నిర్మాతలకు రాసులుగా పోయడం […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 August 2022,8:20 pm

Mahesh Babu Birthday : ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా సినిమా హీరోలకు అభిమానులు మన దేశంలో ఉంటారు. మన దేశంలో కూడా అత్యధికంగా హీరోలను అభిమానించేది కేవలం తమిళ మరియు తెలుగు ప్రేక్షకులు మాత్రమే. తెలుగు మరియు తమిళ హీరోలకు తప్ప మరెక్కడ కూడా ఈ స్థాయి అభిమానులు ఉండరు అనడంలో నూటికి నూరు శాతం నిజం. అభిమానం పేరుతో అభిమానులు లక్షలు.. కోట్ల రూపాయలను హీరోలకు మరియు వారి వారి నిర్మాతలకు రాసులుగా పోయడం తెలుగు రాష్ట్రాల్లో చాలా కామన్ విషయం గా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పుడు మహేష్‌ బాబు పోకిరి సినిమాకు వచ్చిన వసూళ్లు అదే నిరూపిస్తుంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా నేడు పోకిరి సినిమాను దాదాపుగా రెండు వందల థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఈ స్థాయిలో రీ రిలీజ్ దక్కించుకున్న ఘనత మరే సినిమాకు దక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌ లో కూడా ఈ సినిమా ను స్క్రీనింగ్‌ చేసేందుకు అభిమానులు లక్షలు కాదు కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పోకిరి ఒక్క షో స్క్రీనింగ్ ద్వారా నిర్మాతలకు వచ్చే ఆదాయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

mahesh babu birthday special pokiri and okkadu movies screening collections

mahesh babu birthday special pokiri and okkadu movies screening collections

పోకిరి యొక్క షో ల ద్వారా నిర్మాత ఏకంగా మూడు కోట్ల వరకు లాభాలను దక్కించుకుంటన్నట్లుగా తెలుస్తోంది. ఈ స్థాయిలో లాభాలు వస్తాయని నిర్మాతలు కూడా ఊహించి ఉండరు. పోకిరి సినిమా తో పాటు ఒక్కడు సినిమాను కూడా నేడు పలు చోట్ల స్క్రీనింగ్‌ చేస్తున్నారు. అందుకే ఆ సినిమాకు కూడా భారీ టికెట్లు అమ్మడు పోయాయి. ఆ టికెట్ల రేట్ల ఖరీదు దాదాపుగా రూ.60 లక్షలు ఉంటుందని అంటున్నారు. అంటే మొత్తానికి మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆయన అభిమానుల నుండి సినిమాల రీ రిలీజ్ పేరుతో నాలుగు కోట్ల వరకు నిర్మాతలు దండుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌ బాబు ఫ్యాన్స్ ను ఆదర్శంగా తీసుకుని ముందు ముందు మెగా అభిమానులు కూడా ఇదే తరహాలో పాత సినిమాల పండుగ చేసుకోవాలని ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది