Mahesh Babu : కూతురితో కలిసి యాడ్‌లో నటించిన మహేష్ బాబు.. మాములుగా లేదు..!
ప్రధానాంశాలు:
Mahesh Babu : కూతురితో కలిసి యాడ్‌లో నటించిన మహేష్ బాబు.. మాములుగా లేదు..!
Mahesh Babu : మహేష్ బాబు తనయ సితార ఘట్టమనేని ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయకపోయినా సితారకి సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. టీవీ షోలలో మెరిసిన సితార అప్పుడప్పుడు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తుంది. అయితే తాజాగా సితార మహేష్ కలిసి ఓ యాడ్ చేయగా, ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Mahesh Babu : కూతురితో కలిసి యాడ్‌లో నటించిన మహేష్ బాబు.. మాములుగా లేదు..!
Mahesh Babu శ్రీలీల డబ్బింగా..
ఈ యాడ్‌లో రోజ్ కలర్ షర్ట్‌లో మహేష్ బాబు అదిరిపోయారు. షాపింగ్ బాగా ఎంజాయ్ చేశాం కదా అంటూ మహేష్ రాగానే అవును నాన్న అంటూ బాబుపై ఓ డ్రెస్ విసిరింది సితార. వెంటనే మహేష్ కాస్ట్యూమ్ మారిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు బట్టలు విసురుతూ కొత్త కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోయారు. ఈ యాడ్‌లో మహేష్ కొంచెం గడ్డంతో క్లాసిక్ లుక్‌లో కనిపించారు.
ఇక సితార అయితే ముసిముసి నవ్వులు రువ్వుతూ క్యూట్‌గా కనిపించింది. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార పాపతో మహేష్‌ని చూస్తుంటే తండ్రీకూతురిలా లేరని ఏదో అన్నాచెల్లెలుగా కనిపిస్తున్నారంటూ మురిసిపోతున్నారు. మరోవైపు ఈ యాడ్‌లో సితార పాప వాయిస్ అచ్చం హీరోయిన్ శ్రీలీల గొంతులానే అనిపిస్తుంది. శ్రీలీల ఎలా అయితే క్యూట్‌గా మాట్లాడుతుందో సితార డబ్బింగ్ కూడా అలానే ఉంది.
View this post on Instagram