Mahesh Babu : మ‌హేష్ బాబు నోట వైఎస్ జ‌గ‌న్ మాట‌.. ర‌చ్చ షురూ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu : మ‌హేష్ బాబు నోట వైఎస్ జ‌గ‌న్ మాట‌.. ర‌చ్చ షురూ..!

 Authored By sandeep | The Telugu News | Updated on :3 May 2022,7:32 pm

Mahesh Babu : రీసెంట్‌గా మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్ర‌స్తుతం రికార్డులని చెరిపేస్తుంది. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా రూపొందిన ఈ సినిమాలో కామెడీ నటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించారు. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంది. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ బాబు నటించిన సినిమా ఇదే. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’

అంటూ ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు తరచూ చెప్పే డైలాగ్‌ను మహేష్ నోటి వెంట వినపడటం …జగన్ ఫ్యాన్స్ కు పండగలా ఉంది. సోషల్ మీడియాలో అదే రచ్చగా ఉంది.మ‌హేష్ చెప్పిన డైలాగ్ తో సినిమాకి పొలిటిక‌ల్ ట‌చ్ ఇచ్చిన‌ట్టు అయింది. దాంతో పొలిటికల్ టచ్ వచ్చినట్లైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంపై మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమాలోనూ ఈ డైలాగ్ ఉంది. ఆ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే కావాలనే జగన్ మాటలని డైలాగుగా చెప్పించారా..లేక సరదాగా సినిమాకు హైప్ కోసం, చర్చ జరగటం కోసం ఈ డైలాగు పెట్టారా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

mahesh babu says about Ys jagan dialogue

mahesh babu says about Ys jagan dialogue

Mahesh Babu : పొలిటిక‌ల్ ట‌చ్..

మహేశ్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందింది. మైత్రీ – 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. లవ్ .. యాక్షన్ .. కామెడీ నేపథ్యంలో సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్ కి తగిన డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘అప్పుడే మీకు పెళ్లేంటి సార్’ అని వెన్నెల కిశోర్ అంటే, ‘అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా .. దీనమ్మా మెయింటెయిన్ చేయలేక దూల తీరిపోతోంది’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ పేలింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది