Manchu Family : మనోజ్ కి వాళ్ల సపోర్ట్.. మంచి ఫ్యామిలీ గొడవలు పరిష్కారం అదేనా..?
ప్రధానాంశాలు:
Manchu Family : మనోజ్ కి వాళ్ల సపోర్ట్.. మంచి ఫ్యామిలీ గొడవలు పరిష్కారం అదేనా..?
Manchu Family : మంచు ఫ్యామిలీ గొడవలు రోడ్డున పడ్డాయి. మంచు మనోజ్ కి తన ఇంట్లో స్థానం లేదని మోహన్ బాబు మనోజ్, మౌనికలను బయటకు పంపించారు. అంతేకాదు విష్ణు బాడీ గార్డ్స్ చేత మనోజ్ ని కొట్టించే ప్రయత్నం చేశారు. ఈ గొడవల్లో మోహన్ బాబు ఒక ప్రత్యేక ఆడియో రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ ఇష్యూని కవరేజ్ చేయడానికి వెళ్లిన టీవీ 9 రిపోర్టర్ ను మైక్ తోనే కొట్టారని తెలిసిందే. దీనిపై మీడియా అంతా మోహన్ బాబు దుశ్చర్య మీద నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంచు విష్ణు, మనోజ్ ఇద్దరు నాన్న చేసిన తప్పుకి సారీ చెప్పారు. ఐతే ఈ గొడవల్లో మంచి విష్ణు, మోహన్ బాబు ఒకవైపు మనోజ్ ఒక్కడే మరో వైపు అనేలా కనిపిస్తుంది. ఐతే గొడవ మొదలైనప్పుడే మంచు లక్ష్మి వచ్చి ఇద్దరినీ కలిపే ప్రయ్త్నం చేసిందట కానీ మోహన్ బాబు ఈసారి కూతురు చెప్పినా వినలేదని టాక్. అందుకే ఎలా వచ్చిందో అలా రిటర్న్ చెన్నై వెళ్లిందట మంచు లక్ష్మి.
Manchu Family మోహన్ బాబు భార్య కూడా మనోజ్ కు సపోర్ట్ గా..
అంతేకాదు మోహన్ బాబు భార్య కూడా మనోజ్ కు సపోర్ట్ గా ఉందని తెలుస్తుంది. మనోజ్ ని ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు నిర్ణయాన్ని ఆమె కూడా తప్పుపడుతుందట. మనోజ్ కే ఆమె సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతుందట. ఐతే వ్యవహారం చాలా పెద్దది అవుతున్న కారణంగా మంచి ఫ్యామిలీ అంతా వారికి సంబందించిన కుటుంబ పెద్దలతో కూర్చుని ఇష్యూని సాల్వ్ చేసుకోవాలని భావిస్తున్నారట.
సోషల్ మీడియ, మీడియా వ్యవహారాన్ని మరోలా ప్రొజెక్ట్ చేస్తుందని. ఫ్యామిలీ ఇష్యూ మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అందుకే మనోజ్ ప్రెస్ మీట్ పెడతానని పెట్టలేదు. దాదాపు చర్చలతోనే ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు. ఐతే మోహన్ బాబు ఇన్నేళ్ల కెరీర్ లో ఇలా కొడుకులు చేస్తున్న పని వల్ల కృంగి పోతున్నారు. ఐతే మీడియా రిపోర్టర్ ని కొట్టినందుకు ఆయన మీద కేసు వేసిన విషయం తెలిసిందే. Manchu Family, Manchu Family Fight, Mohan Babu, Manchu Manoj, Lakshmi, Vishnu ,