Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో ఎవరు పనిచేయాలని అనుకోవట్లేదా.. పనోళ్లు దొరక్క వాళ్ల ఇబ్బందులా..?
ప్రధానాంశాలు:
Mohan Babu : మోహన్ బాబు ఇంట్లో ఎవరు పనిచేయాలని అనుకోవట్లేదా.. పనోళ్లు దొరక్క వాళ్ల ఇబ్బందులా..?
Mohan Babu : మంచు ఫ్యామిలీలో గొడవల విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు ఫ్యామిలీ గొడవను మీడియా ప్రసారం చేయడాన్ని కలెక్షన్ కింగ్ సీరియస్ అవగా ఒక రిపోర్టర్ చెవికి గాయం చేసిన విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత ఇష్యూ సీరియస్ కాకుండా మోహన్ బాబు ఇంట్లోనే సమస్యకు పరిష్కారం చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఐతే మనోజ్ ఇంటి జెనరేటర్ లో విష్ణు షుగర్ పోశాడని మంచు మనోజ్ మరోసారి గొడవ చేయగా మళ్లీ పోలీసుల దాకా ఫిర్యాదు వెళ్లిందని టాక్. ఐతే ఈ విషయంపై మొదటిసారి స్పందించిన మంచు మోహన్ బాబు సతీమణి నిర్మలా దేవి విష్ణు తన బర్త్ డే కేక్ కట్ చేశాడు తప్ప మనోజ్ చెప్పినట్టు జెనరేటర్ లో షుగర్ ఏమి పోయలేదని అన్నాడు. ఐతే ఆమె రిలీజ్ చేసిన లెటర్ లో ఒక విషయం భాగా హైలెట్ అవుతుంది. అదేంటి అంటే మోహన్ బాబు జల్ పల్లి ఇంట్లో పనిచేసేందుకు పని వాళ్లు ఎవరు అంతగా ఆసక్తి చూపించట్లేదని.. పని వాళ్లు అనాసక్తిగా ఉన్నారని నిర్మలా దేవి రాసుకొచ్చారు.
Mohan Babu పని వాళ్లు ఎవరు అక్కడ పనిచేయాలని..
మంచు వారి అన్నదమ్ముల ఫైట్ లో పని వాళ్లను బలి చేస్తూ వారి మీద చేయి చేసుకుంటారన్న వాదన ఉంది. అందుకే పని వాళ్లు ఎవరు అక్కడ పనిచేయాలని అనుకోవట్లేదని అంటున్నారు. ఉన్న పని వాళ్లు కూడా మానేశారని.. విష్ణు, మనోజ్, మోహన్ బాబుల మధ్య గొడవల కారణంగా పనోళ్లు ఎవరు అక్కడ పని చేయాలని అనుకోవట్లేదట. ఎందుకంటే ముగ్గురిలో ఎవరికి కోపం వచ్చినా కూడా పనోళ్ల మీద ప్రతాపం చూపిస్తారన్న టాక్ ఉంది.
అందుకే మోహన్ బాబు ఇంట్లో పని చేయడానికి ఎవరు సాహసం చేయట్లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల వల్ల ఇన్నాళ్లు ఆయన తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి. తనయులిద్దరినీ ఒకచోటకు తెచ్చి ఈ సమస్యకి పర్ష్కారం చూపకపోతే మాత్రం కచ్చితంగా ఈ ఇష్యూ మరింత పెద్దదయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.