Manchu Lakshmi : రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో త‌ల‌దాచుకున్న మంచు ల‌క్ష్మీ.. అంత క‌ష్టం ఏమోచ్చింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manchu Lakshmi : రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో త‌ల‌దాచుకున్న మంచు ల‌క్ష్మీ.. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2024,4:12 pm

Manchu Lakshmi : మ‌ల్టీటాలెంటెడ్ ఆర్టిస్ట్, మోహన్ బాబు త‌న‌య మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నిర్మాతగా, ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన మంచు లక్ష్మీ ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్ లో ఉంటుంది. అదిరిపోయే అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. ఆమెకు టాలీవుడ్ లో ఆశించినంత గుర్తింపు అయితే రాలేదు. ఇటీవ‌ల‌ కుటుంబంలో తనకు అన్యాయం జరిగిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మా నాన్నకు నేను నటి కావడం ఇష్టం లేదు. నా బ్రదర్స్ కి సులభంగా దక్కినవి నేను మాత్రం కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే అని మంచు లక్ష్మి పేర్కొంది.

Manchu Lakshmi గ్రూప్ గురించి కామెంట్స్..

తాజా ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ కి తనకి మధ్య ఉన్న స్నేహం గురించి కూడా మంచు ల‌క్ష్మీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. “నేను ముంబై వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఉండటానికి అపార్ట్‌మెంట్ ఏం లేదు. ఆ సమయంలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరకీ చెప్పలేదు.. ఎందుకంటే చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పనిచేయాల్సిన అవసరం ఏంటి అంటారు. అందుకే నేను నీ ఇంట్లో ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్‌కి కూడా చెప్పాను. అప్పుడు నేను ఎందుకు చెప్తా అని చరణ్ అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా.. ఇప్పుడు నేనే చెప్పేశా. అయితే తర్వాత నేను నీ ఇంట్లో ఉండనని చరణ్‌కి కూడా చెప్పా. కానీ నీకు నచ్చినన్ని రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అసలు నేను ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నానో కూడా చరణ్‌కి తెలీదు.” అంటూ మంచు లక్ష్మి పేర్కొంది.

Manchu Lakshmi రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో త‌ల‌దాచుకున్న మంచు ల‌క్ష్మీ అంత క‌ష్టం ఏమోచ్చింది

Manchu Lakshmi : రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో త‌ల‌దాచుకున్న మంచు ల‌క్ష్మీ.. అంత క‌ష్టం ఏమోచ్చింది..!

ఇక వాట్సాప్ గ్రూప్ గురించి కూడా మంచు ల‌క్ష్మీ ఆసక్తిక‌ర కామెంట్స్ చేసింది. ఇందులో 142 మంది సభ్యులు ఉంటారు. వీళ్లంతా ఆర్టిస్టులే. ఇందులో అందరూ తమ సినిమాల ట్రైలర్లు, టీజర్లు, ఈవెంట్స్ గురించి షేర్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన వెంటనే మేమంతా మా పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటాం. అందుకే ఈ గ్రూప్ క్రియేట్ చేశాం. ఈ గ్రూపును నేను రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాను. రానా, రామ్ చరణ్ మేమంతా కలిసి పెరిగాం. మా సినిమాలను మేము ఎలాగో ప్రమోట్ చేసుకుంటాం. అందుకే మిగిలిన వాళ్లని కూడా యాడ్ చేసి ఇంత పెద్ద గ్రూప్ చేశాం అంటూ మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది