Manchu Lakshmi : మంచు లక్ష్మీ యోగసనాలు.. థ్రిల్ అవుతున్న నెటిజన్స్
Manchu Lakshmi: నేడు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా చాలా మంది ప్రముఖులు యోగాసనాలు చేస్తూ నెటిజన్స్‌కి మంచి వినోదం పంచారు. కర్ణాటకలోని మైసూరు కోటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ పేరుతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత వైవిద్యాన్ని, ప్రత్యేకతను యోగా ప్రతిబింబిస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సహాకారంతో యోగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తమైందని అన్నారు. యోగాను గుర్తించినందుకు ఐక్యరాజ్యసమితికి ప్రధాని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
శారీరక, మానసిక వికాసానికి దోహదపడే యోగాపై ప్రపంచ ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తూ, అదే సమయంలో మానవాళికి సందేశమిస్తూ నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మంచు లక్ష్మీ కూడా యోగా డే సందర్భంగా యోగసనాలు చేసింది. మంచు లక్ష్మీని చూసి నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. అంతేకాక మంచు లక్ష్మీ టాలెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి. అమెరికాలో చదువుకున్న మంచు లక్ష్మి అక్కడే హాలీవుడ్ సీరియల్స్ లో నటించింది. ఆ తరవాత ఇండియాకు షిఫ్ట్ అయ్యింది.

manchu lakshmi yoga stills viral
Manchu Lakshmi : మంచు లక్ష్మీ మజా,..
ఇక్కడకు వచ్చిన కొత్తలో టీవీ షోలతో పాటూ వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అంతే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేసింది చేస్తోంది. మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన చాలా విషయాల్ని ఆమె.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. యూట్యూబ్ వేదికగా తరచూ హోంటూర్స్, ఇంట్లో సెలబ్రెషన్స్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కూడా తరచూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.