Manchu Manoj : మళ్లీ మోహన్ బాబు దగ్గరకు మనోజ్.. ఏం జరగబోతుంది..!
ప్రధానాంశాలు:
Manchu Manoj : మళ్లీ మోహన్ బాబు దగ్గరకు మనోజ్.. ఏం జరగబోతుంది..!
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో లుకలుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు Mohan Babu ఈ వ్యవహారాలన్నిటినీ సరిచేయాలని ట్రై చేస్తున్నా కూడా కుదరట్లేదు. మంచు విష్ణు, మనోజ్ మధ్య కూడా సరైన సఖ్యత లేదన్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు జల్ పల్లి ఇంటి దగ్గర మనోజ్ చేసిన హంగామా తెలిసిందే. ఈ గొడవల్లోనే మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ మీద దాడి చేశాడు.ఐతే పండగ టైం లో కాస్త గ్యాప్ తీసుకున్న మంచు గొడవలు మళ్లీ మొదలయ్యాయని తెలుస్తుంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మంచు మోహన్ బాబు పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఐతే ఇప్పుడు అక్కడకు మనోజ్ వెళ్తున్నాడని తెలిసి మళ్లీ ఆందోళన మొదలవుతుందని అంటున్నారు. మంచు మనోజ్ వెళ్తున్నారని తెలిసి ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. మంచు ఫ్యామిలీ గొడవలు వీధి కెక్కగా మళ్లీ ఏం జరుగుతుందో అన్న సందిగ్ధం ఏర్పడింది.
Manchu Manoj : నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాడు..
మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఐతే ఈ విషయంలో మనోజ్ ఒక వైపు ఉండగా మంచు ఫ్యామిలీ మొత్తం ఒక వైపు ఉంది. మరి మనోజ్ ఈ విషయంలో నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నాడు. మంచు ఫ్యామిలీ గొడవలు మళ్లీ తారాస్థాయికి చేరతాయా అన్నది తెలియాల్సి ఉంది.
ఓ పక్క రిపొర్టర్ పై దాడి కేసులో మోహన్ బాబు కేసు కోర్ట్ లో ఉంది. ఐతే ఈ గొడవల్లో ఎవరి తరపున న్యాయం ఉంది అన్నది తేలచలేకపోతున్నారు. మంచు మోహన్ బాబు మాత్రం మనోజ్ ని మందలిస్తూ ఒక ఆడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐనా సరే మళ్లీ మళ్లీ మనోజ్ మోహన్ బాబు ని కలిసేందుకు తనకు న్యాయం కావాలని ప్రయత్నిస్తున్నాడు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ గొడవల మీద క్లారిటీ ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి. ఐతే మంచు ఫ్యామిలీ మొన్నటిదాకా వసుదైక కుటుంబం లాగా ఉండగా ఇప్పుడు గొడవలతో హాట్ టాపిక్ గా మారారు. Manchu Manoj, Manchu Mohan Babu, Manchu Family, Tollywood