Manchu Vishnu : నా భార్య హాట్.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: October 28, 2021, 2:40 pm

Manchu Vishnu  : మంచు విష్ణు ఈ మధ్య ఎక్కువగా హల్చల్ చేస్తున్నాడు. మా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత మంచు విష్ణు ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. మా అధ్యక్షుడిగా హోదాలో మంచి నిర్ణయాలే తీసుకుంటున్నాడు. ఇక అమ్మాయిలు, హీరోయిన్ల మంచికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఈక్రమంలోనే యూట్యూబ్ చానెళ్ల మీద కన్నెర్ర చేశాడు. తప్పుడు వార్తలు, పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెడితే ఊరుకునేది లేదని అన్నాడు. కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.

Manchu Vishnu Says that Viranica Is Hot

Manchu Vishnu Says that Viranica Is Hot

అయితే ఇప్పుడు విష్ణు కాస్త విరామం తీసుకున్నాడు. గత కొన్ని నెలలు మా ఎన్నికల ప్రచారంలో తల మునకలై ఉన్న విష్ణు.. ఇప్పుడు భార్యతో కలిసి వెకేషన్స్‌కు వెళ్లాడు. అమెరికాకు వెళ్తున్నానంటూ భార్యతో ఫ్లైట్‌లో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. అంతకు ముందు విరానిక ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన భర్తను చూపిస్తూ హాయ్ అని చెప్పమంది. కానీ మంచు విష్ణు మాత్రం ముద్దు ఇస్తావా? అంటూ భేరం ఆడేశాడు. దీంతో విరానిక సైలెంట్ అయిపోయింది.

Manchu Vishnu  : విరానికపై మంచు విష్ణు కామెంట్లు

Manchu Vishnu

Manchu Vishnu

ఇక ఆ తరువాత మరోసారి మంచు విష్ణు ఓ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా భార్య విరానిక గురించి ఆయ‌న చేసిన కామెంట్ వైర‌ల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వీడియో షేర్‌ చేస్తూ.. కాస్తా బ్రేక్‌ తీసుకుంటున్నా అని చెప్పారు. అలాగే తన భార్య విరానికను చూపిస్తూ.. అవును తను హాట్‌.. ఎప్పుడూ ఫోన్‌లో బిజీగా ఉంటుంది అంటూ మంచు విష్ణు చెప్ప‌డంతో అంతా ఆశ్చర్యపోయారు. మొత్తానికి ఈ ఫ్లైట్ జర్నీలో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp