Pushpa 2 : పుష్ప 2 లో చిరంజీవి .. హింట్ ఇచ్చిన సుకుమార్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pushpa 2 : పుష్ప 2 లో చిరంజీవి .. హింట్ ఇచ్చిన సుకుమార్ ..!

Pushpa 2 : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుష్ప 2 గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. పుష్ప రాజ్ పాత్రతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎటువంటి క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలను రీమిక్స్ చేసి బన్నీ […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 October 2023,9:00 pm

Pushpa 2 : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుష్ప 2 గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ గా మారింది. పుష్ప రాజ్ పాత్రతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎటువంటి క్రేజ్ తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలను రీమిక్స్ చేసి బన్నీ తనదైన స్టైల్ లో డాన్స్ చేయబోతున్నాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ ను కూడా అక్కడక్కడ జోడించారట.

అయితే పుష్ప 2 సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ఫ్యాన్ గా అల్లు అర్జున్ నటించబోతున్నాడు అనేదానికి సుకుమార్ పుష్ప పార్ట్ వన్ లోనే హింట్ ఇచ్చేశాడు. పుష్ప 1 లో పుష్పరాజ్ శ్రీవల్లి బ్రిడ్జి మీద మాట్లాడుకునే సీన్ ఉంటుంది. ఆ సమయంలో శ్రీ వల్లి తన స్నేహితులతో కలిసి ‘ చూడాలని ఉంది ‘ సినిమాకు వెళ్లాలి అనుకుంటుంది. అంటే అక్కడ చిరంజీవికి శ్రీవల్లి పెద్ద ఫ్యాన్. ఇక ఇదే పాయింట్ ను పట్టుకొని సుకుమార్ పుష్ప 2 లో మంచి సీన్స్ జోడించారట. పుష్ప 2 లో శ్రీవల్లి చిరంజీవి సినిమాకు వెళుతుందట. ఈసారి భర్త పుష్ప రాజ్ తో కలిసి చిరంజీవి సినిమాలు చూసి శ్రీవల్లి ఎంజాయ్ చేస్తుందట.

Mega star Chiranjeevi in Pushpa 2

Mega star Chiranjeevi in Pushpa 2

అలా చిరంజీవిని కూడా పుష్ప సినిమాలో పెట్టి భారీగా హైప్ పెంచేస్తున్నాడు సుకుమార్. మొత్తానికి అయితే పుష్ప 2 సినిమాని మరింత అంచనాలకు మించి సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు దేశమంతట పుష్ప 2 సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది