Wild dog : వైల్డ్ డాగ్ మీద మెగాస్టార్ కామెంట్స్…ఇండస్ట్రీలో హాట్ టాపిక్..!
Wild dog : వైల్డ్ డాగ్ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా థియేటర్స్ మూతపడటంతో ఓటీటీకి ఇచ్చేశారు. కానీ డిసెంబర్ 25 మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ ఇండస్ట్రీ ఆశలు చిగురించేలా చేయగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మాస్ మహారాజ క్రాక్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ధైర్యాన్నిచ్చింది. దాంతో వరసగా టాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాల థియేటర్స్ రిలీజ్‌కి డేట్ లాక్ చేసుకున్నారు.

megastar-comments-on-wild-dog-this-has-become-industry-hot-topic
దాంతో కింగ్ నాగార్జున కూడా ఓటీటీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొని థియేటర్స్ రిలీజ్‌కి వచ్చేశాడు. అనూహ్యంగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం ప్రమోషన్స్‌ని మొదలు పెట్టడం..చక చకా జరిగిపోయాయి. ఈ క్రమంలో వైల్డ్ డాగ్ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా ఊహించకుండా అంచనాలు బాగా పెరిగిపోయాయి. దాంతో నాగార్జున ప్రేక్షకుల అంచనాలను అందుకోగలనా లేదా అన్న చిన్న టెన్షన్‌కి లోనయ్యాడు.
Wild dog : వైల్డ్ డాగ్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తిని పెంచిన మెగాస్టార్..!
అందుకే నాగార్జుననే స్వయంగా తన టెన్షన్‌ని తీర్చుకోవడానికి మెగాస్టార్ ఇంటికి వెళ్ళాడు. ఆ రకంగా పరోక్షంగా వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్‌కి కారణమయ్యాడు. ఇక సినిమా రిలీజయ్యాక అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని సక్సస్ ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా నాగార్జున బృందం సక్సస్ మీట్‌ని నిర్వహించారు కూడా. కాగా మెగాస్టార్ ఈ మీట్‌కి ముఖ్య అతిథిగా వచ్చి సినిమాని .. నాగార్జునని ప్రశంసలతో ముంచేశాడు. స్వయంగా ట్విట్టర్‌లో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో పాటు వైల్డ్ డాగ్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తిని పెంచింది.
ఇప్పుడే #WildDog చూసాను.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని,ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా.. 1/2
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2021