Mohan Babu : మోహన్ బాబు ఎందుకు ఇలా అయిపోయాడు..!!
Mohan Babu ; ఇవాళ టాలీవుడ్ విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు. విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన తెలుగు ప్రేక్షకులను తన డైలాగ్ డెలివరీతో ఎంతగానో ఆకట్టుకున్నారు. 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ జీవితంలో నేను చాలా కష్టాలు పడి పైకి వచ్చా, ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని కోరుకుంటున్నాను. రాజకీయాలలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని హోస్ట్ అడగగా దానికి బదులుగా రాజకీయాలు నీచమైనవి అని ఆయన విమర్శించారు.
మోహన్ బాబు తన లాంటి ముక్కుసూటి వ్యక్తి రాజకీయాలలో మనుగడ సాధించడం కష్టం అని తెలిపారు. వైసీపీకి గడిచిన ఎన్నికలలో ప్రచారం చేయడంపై ఆయన స్పందించారు. కేవలం బంధుత్వం కారణంగానే మద్దతు ఇచ్చాం తప్ప పదవిని ఆశించి కాదని, పదవుల కోసం పనిచేసే వ్యక్తిని కాదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మోడీ నాకు నచ్చిన నాయకుడని అందుకోసం ఆయనను కుటుంబ సమేతంగా వెళ్లి కలిసి వచ్చామని ఆయన అలాంటి వాళ్ళు ఉంటే దేశం ముందుకు వెళుతుందని నేను నమ్ముతాను అని తెలిపారు.
ఇక మోహన్ బాబు రాజకీయాలలోకి వచ్చే అవకాశం అసలు లేదని ఓపెన్ గా చెప్పేశారు. ఎన్టీఆర్ పాలనలో మోహన్ బాబు టిడిపిలో ఓ వెలుగు వెలిగారు. కొన్నాళ్లకు టిడిపి తో చెడిపోవడంతో వైసీపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన పార్టీ పదవులలో, ప్రభుత్వ పదవులలో ఆయనకు ఎదురు దెబ్బ తగలడంతో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో మోహన్ బాబు పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలతో తెలుస్తోంది.