Saif Ali Khan :సైఫ్‌పై దాడి చేసిన అసలు నిందితుడు ఎవరో కాదు… సంచలన విషయాలు వెలుగులోకి..!
ప్రధానాంశాలు:
Saif Ali Khan :సైఫ్‌పై దాడి చేసిన అసలు నిందితుడు ఎవరో కాదు...సంచలన విషయాలు వెలుగులోకి..!
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood హీరో సైఫ్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవర చిత్రంతో Devara Movie తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. Saif Ali Khanసైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో చాలా ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ Bangladesh వాసిగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశామనీ.. అతనే సైఫ్ అలీ ఖాన్‌పై ఆయన ఇంట్లో దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. అతని పేరు మహ్మద్ షరిఫుల్ ఇస్లామ్ షెహజాద్ అనీ 31ఏళ్ల వయసుందని తెలిపారు.బాండ్రా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకొని స్టేషన్‌కు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. దీంతో నిందితుడు దొరికాడని అంతా అనుకున్నారు.
Saif Ali Khan అసలు విషయం ఇది..!
అయితే తమ అదుపులో ఉన్నది నిందితుడు కాదని.. ఆ వ్యక్తికి సైఫ్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది సేపటికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో తాజాగా Mumbai Police ముంబై పోలీసులు మరోమారు స్పందించారు. ఈ కేసులో అసలు నిందితుడు విజయ్ దాస్‌ను తాము అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. సైఫ్ Saif Ali khan మీద దాడి చేసింది తానేనని అతడు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. అయితే ముంబయికి వచ్చి వర్లీ కోలివాడ సమీపంలో ఉంటున్నాడని చెప్పారు. Saif Ali Khan సైఫ్-కరీనా ఇంటికి సమీపంలో ఉండే ఒక పబ్‌లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడని చెప్పారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో పనిచేయడం వల్ల సులువుగా ఆ ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
కేసులో నిందితుడు విజయ్ దాస్‌ను అరెస్ట్ చేశాం. అతడు రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. నేరం చేశానని అతడు ఒప్పుకున్నాడు అని పోలీసులు తెలిపారు. నిందితుడు తన పేరును మొదట విజయ్ దాస్ Vijay Das అని చెప్పాడని.. కానీ ఆ తర్వాత తాను మహ్మద్ సాజిద్ అని పేర్కొన్నాడని సమాచారం. అయితే అతడి అసలు పేరు ఏంటి? ఈ నేరం ఎందుకు చేశాడు? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా? ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది? అతడికి ఎవరు సహకరించారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.