Samantha – Naga Chaitanya : సమంత- నాగ చైతన్య ఇంటి గుట్టు రట్టు చేసిన సీనియర్ హీరో..!
Samantha – Naga Chaitanya : ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత నాగ చైతన్యలు ఊహించని విధంగా విడిపోయారు. అక్టోబర్ 2న సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. వీరి విడాకుల ఎపిసోడ్ లో హైడ్రామా చోటు చేసుకుంది. మీడియాలో పలు నిర్ధార కథనాలు ప్రసారమయ్యాయి. సమంత సదరు కథనాలు ఆపివేయాలని అభ్యర్థించారు. అయినా ఆగకపోవడంతో లీగల్ యాక్షన్ కి తెగబడ్డారు.ఇక విడాకులు అయినప్పటికీ సమంత-నాగచైతన్య కలిసి నటిస్తారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే అది నిజం కాదని, కనీసం వాళ్ళు ఒకరిని మరొకరు కలవడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తుంది.
వీరు విడిపోయి ఏడాది కావొస్తున్నా కూడా ఇంకా వీరికి సంబంధించి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా వీరి దాంపత్య జీవితం, విడాకులపై సీనియర్ నటుడు మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య.. మురళీ మోహన్ అపార్ట్‌మెంట్లో ఓ పోర్షన్ తీసుకొని ఉంటున్న విషయం తెలిసిందే. మా వాడికి ఏవీ ఓ పట్టాన నచ్చవు.. మీ ప్లాట్స్ బాగున్నాయని చెప్పడంతో చివరకు మురళీమోహన్ తనయుడి ఫ్లాట్‌ను చైతుకు ఇచ్చారట. చైతు పెళ్లయ్యాక కూడా సమంతతో అందులోనే కాపురం పెట్టాడట. మురళీ మోహన్ ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఇద్దరు చాలా ఆప్యాయంగా ఉండే వారట.

murali mohan gives clarity about Samantha Naga Chaitanya divorce
Samantha – Naga Chaitanya : ఇలా చెప్పాడు..
వాళ్లింట్లో ఏం జరిగినా మురళీమోహన్‌కు సౌండ్ కూడా వినిపిస్తుందట. సెలబ్స్ అంటే సహజంగానే ఫ్రెండ్స్‌ను తీసుకువచ్చి పార్టీలు చేసుకుని.. నానా గోల చేస్తారని.. కాని వారు ఏ రోజూ అలా చేయలేదని చెప్పారు. ప్రతి రోజు ఉదయం లేచి సమంత జిమ్ చేసేదని.. చైతు – సమంత కలిసి బయట వాకింగ్ ప్లేస్‌లో కొద్దిసేపు నడిచేవారట. ఎప్పుడూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఎంతో అన్యోన్యతతో ఉండేవారని.. వారి మధ్య విబేధాలు ఉన్నట్టు తాను ఎప్పుడూ చూడలేదని ఆయన తెలిపారు. ఒక రోజు తన పనిమనిషి వచ్చి వాళ్లు విడిపోతున్నారు.. చైతు రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు.. హోటల్లో ఉంటున్నాడని చెప్పేవరకు విషయం తనకు తెలియదన్నారు మురళీ మోహన్. నాకు ముందు తెలిసి ఉంటే నాగ్‌తో ఈ విషయం మాట్లాడే వాడినని మురళీ స్పష్టం చేశారు.