Anasuya Bharadwaj : సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకు అనసూయ తిక్క జవాబు.. !
Anasuya Bharadwaj : నటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకెళుతున్న అనసూయ తాజాగా ‘ రజాకార్ ‘ అనే సినిమాలో నటించారు. తెలంగాణలో రెండు మతాల మధ్య వైషమ్యాలకు కారణమైన రజాకార్లు అరాచకాల నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది ఈ సినిమాలో బాబీ సింహ, వేదిక, అనసూయ భరద్వాజ్, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై యాటా […]
ప్రధానాంశాలు:
Anasuya Bharadwaj : సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నకు అనసూయ తిక్క జవాబు.. !
Anasuya Bharadwaj : నటి అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకెళుతున్న అనసూయ తాజాగా ‘ రజాకార్ ‘ అనే సినిమాలో నటించారు. తెలంగాణలో రెండు మతాల మధ్య వైషమ్యాలకు కారణమైన రజాకార్లు అరాచకాల నేపథ్యంగా ఈ సినిమా రూపొందింది ఈ సినిమాలో బాబీ సింహ, వేదిక, అనసూయ భరద్వాజ్, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్ పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో కోడూరు నారాయణరెడ్డి నిర్మించారు. మార్చి 1వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, హిందీ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రజాకార్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ…
రజాకార్ సినిమాని ధైర్యంగా తీసి చరిత్రను అందరికీ చూపిస్తున్నందుకు నిర్మాత గూడూరు నారాయణరెడ్డి కి థాంక్స్. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు సత్యనారాయణ గారికి థాంక్స్. మన నైజాంలో హైదరాబాదులో ఏం జరిగిందో అందరూ తెలుసుకోవాలి అని అనసూయ ఎమోషనల్ అయ్యారు. ఫ్రెంచ్ రెవల్యూషన్, అలెగ్జాండర్ గురించి కాదు ముందు మన గురించి మనం తెలుసుకుందాం. మార్చ్ 1 సినిమా చూసి అందరూ చలించి పోతారు. నేను ఆల్రెడీ సినిమాను చూశాను. ఇంద్రజ, ప్రేమ, వేదిక, సింహ, మకరంద్ అద్భుతంగా నటించారు. సినిమా అనేది చాలా గొప్ప మాధ్యమం. ఈ సినిమాలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది అని అనసూయ అన్నారు. ఇటీవల కాలంలో అన్ని రకాల పాత్రలను చేస్తున్నాను.
భారమైన పాత్రలు చేసిన తర్వాత కూడా స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తాను. నేను ఎప్పటికీ మారను. నేను మారలేదు. ప్రధానంగా నేను ఎంటర్టైనర్ ను. ప్రత్యేక పరిస్థితుల గురించి నన్ను దృష్టిలో పెట్టుకొని రాసిన పాత్రలు నా వద్దకు వస్తే తప్పకుండా చేస్తాను అని అనసూయ చెప్పుకొచ్చారు. రజాకార్ అనే సినిమాలో పాత్రకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. నేను చేసే ప్రతి పాత్రకు కనెక్ట్ అవుతాను. చరిత్రలో ఇది జరిగిన యదార్థగాధ. ఆ చరిత్ర గురించి ఇప్పుడు మాటల్లో చెప్పలేను కానీ విడుదల తర్వాత నా పాత్ర ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. ఇకముందు కూడా స్పెషల్ సాంగ్స్ లో నటిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే కచ్చితంగా చేస్తాను అని అనసూయ చెప్పుకొచ్చారు.