Nag Ashwin : కల్కి2ని నాగ్ అశ్విన్ పక్కన పెట్టేశాడా… ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..!
Nag Ashwin : సలార్ వంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా అంచనాలను నిలబెట్టుకుంటూ బంపర్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. జూన్ 27వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లకు సమీపించింది. అద్భుతమైన విజువల్స్, వీఎఫ్‍ఎక్స్‌తో ఆకట్టుకుంటోంది. కల్కి సినిమాటిక్ […]
ప్రధానాంశాలు:
Nag Ashwin : కల్కి2ని నాగ్ అశ్విన్ పక్కన పెట్టేశాడా... ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్..!
Nag Ashwin : సలార్ వంటి సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కల్కి. ఈ సినిమా అంచనాలను నిలబెట్టుకుంటూ బంపర్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మైథో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించారు. జూన్ 27వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లకు సమీపించింది. అద్భుతమైన విజువల్స్, వీఎఫ్‍ఎక్స్‌తో ఆకట్టుకుంటోంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ అంటూ కల్కి 2898 ఏడీ మూవీకి సీక్వెల్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
Nag Ashwin అనేక అనుమానాలు..
కల్కి 2 సినిమా నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలవుతుందని, 2025 లోనే సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాత అశ్వినీదత్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు కల్కి 2 సినిమా ఇప్పట్లో రాదా అనే సందేహాలు వస్తున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ కొత్త సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ప్రకటించారు. ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ ఏవీఎం స్టూడియోస్, నాగ్ అశ్విన్ కలిసి ఒక సినిమా తీస్తున్నట్టు ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ కావాలని ఒక ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇది నాగ్ అశ్విన్ దర్శకుడిగా చేసే కొత్త సినిమాకేనా? లేకపోతే నిర్మాతగా నాగ్ అశ్విన్ ఏవీఎం స్టూడియోస్ తో కలిసి సినిమా చేస్తున్నాడా తెలియాలి. ఈ పోస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ కల్కి 2 వదిలేసి కొత్త సినిమా చేస్తున్నాడేమో అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
కల్కి 2898 ఏడీ సినిమా భారీ ఓపెనింగ్ దక్కించుకోవడంతో ఈ చిత్రం ఫుల్ రన్‍లో కూడా భారీగానే వసూళ్లు రాబట్టింది. కల్కి 2898 ఏడీ సినిమాపై ప్రేక్షకులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి విజువల్స్ భారత సినీ చరిత్రలో తొలిసారి చూస్తున్నామంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్‍కు సలాం అంటున్నారు. ఈ సినిమాలో సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటనకు చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. భైరవ పాత్రలో డార్లింగ్ దుమ్మురేపగా.. అశ్వత్థామగా అమితాబ్ ఆకట్టుకున్నారు. దీపిక పదుకొణ్ కూడా అద్భుతంగా నటించారు. కమల్ హాసన్ కూడా మరోసారి తన మార్క్ డిఫరెంట్ రోల్ చేశారు. శోభన, సస్వస్త ఛటర్జీ, పశుపతి, దిశాపటానీ, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు చేశారు.