Naga babu Counter on Balakrishna
Nagababu : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికల వేడి మొదలైంది. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ ఉంటే ఇప్పటి నుంచే పదవి కోసం పోటీ పడి ఒకరిని ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్. ఇటీవలే పలువురు ప్రముఖులు తమ అభ్యర్థిత్వాలను ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ తమ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో కూడా ప్రత్యేకంగా వెళ్లడించారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మా లో జరుగుతున్న అనేక విషయాలను తవ్వి తీస్తున్నారు.
Naga babu Counter on Balakrishna
ఆ విషయాల వల్ల ఇరు బృందాల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన పలు విషయాల గురించి నందమూరి బాలకృష్ణ Balakrishnaస్పందిస్తూ ఏకగ్రీవం చేయాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దానికి ముందు ఇదే విషయాన్ని హీరో మంచు విష్ణు తెలిపాడు. దాంతో తాజాగా ఈ విషయమై మెగా బ్రదర్ నాగబాబు Naga babu స్పందించారు. చాలా కాలంగా ‘మా’ ఎన్నికలు అంటే ఇద్దరు ముగ్గురు ప్రముఖులు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. కానీ, ఈ సారి ఐదుగురు నటీనటులు ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించారు.
ముందుగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీలో నిలబడనున్నట్టు ప్రకటించగా ఆ తర్వాత జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీ పడబోతున్నట్టు అనూహ్యంగా ప్రకటించారు. కాగా బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ‘మూవీ ఆర్టిస్టు అసోషియేషన్’ స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్థావిస్తూ మా బిల్డింగ్ నిర్మాణానికి తానే సొంత డబ్బులు ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరాడు. ఈ సందర్భంగా ఎన్నికను ఏకగ్రీవం చేస్తే తప్పుకుంటానని కూడా వెల్లడించాడు.
Balakrishna About on maa association building
కాగా ఈ గురువారం బాలయ్య దీనికి స్పందించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను బహిరంగంగా చర్చించకూడదు అంటూనే కొందరు ధనాన్ని వృథా చేశారంటూ బాలయ్య విమర్శించారు. అదే సమయంలో బిల్డింగ్ కోసం మంచు విష్ణుకు మద్దతు ఇస్తానని ప్రకటించారు. దాంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనుకోవడం అంత మంచి నిర్ణయం కాదని అన్నారు. ఎవరిని ఎన్నుకోవాలన్నది మా సభ్యులు నిర్ణయించాల్సింది. కాబట్టి తప్పకుండా ఎన్నికలు జరగాల్సిందే. వీరిలో ది బెస్ట్ పర్సన్ ఎవరో వాళ్లే గెలవాలి’ అని తన అభిప్రాయాన్ని సూటిగా తెలిపారు.
ఇది కూడా చదవండి ==> ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారు.. అసలు కారణం ఇదే.. బాలకృష్ణ
ఇది కూడా చదవండి ==> సుమ, రాజీవ్ కనకాలని శాపనార్థాలు పెట్టిన నటి అన్నపూర్ణ..!
ఇది కూడా చదవండి ==> ఎప్పుడూ తొక్కేస్తోంది.. సుమపై శ్రీముఖి అసహనం!
ఇది కూడా చదవండి ==> నీలో నాకు నచ్చింది అదే.. రష్మీపై ఓంకార్ కామెంట్స్ వీడియో వైరల్..!
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
This website uses cookies.