Naga Babu : పవన్‌కి సమస్య వస్తే ఒక్కరు మాట్లాడడం లేదు, రేపు మీకు ఇదే సమస్య… నాగబాబు సంచలన కామెంట్స్
Naga Babu:మెగా బ్రదర్ నాగబాబు తన అన్నయ్య చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకి ఎలాంటి అన్యాయం జరిగిన అస్సలు ఊరుకోడు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌ని ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకి గురి చేస్తుంది. ముఖ్యంగా పవన్ నటిస్తున్న సినిమాల విషయంలో వారు వ్యవహరిస్తున్న ధోరణి అస్సలు మింగుడుపడడం లేదు. బెనిఫిట్ షో రద్దు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో అమ్మకాలు జరపాలని జీవోలు ఇవ్వడం.. బెనిఫిట్ షో వేసిన థియేటర్లపై అధికారుల దాడులు ఇలా అన్ని కలిసి పలుచోట్ల థియేటర్లు మూసివేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు.. రాజకీయ నేతలు స్పందించి వారి అభిప్రాయాలూ తెలిపారు. తాజాగా నాగబాబు ఏపీ ప్రభుత్వంతో పాటు సినిమా హీరోలు మౌనంగా ఉండడంపై కూడా మాట్లాడారు.
Naga Babu : నాగబాబు ఆక్రోశం..
పవన్ ఆ రోజు.. ఇండ్రస్ట్రీ తరపున మాట్లాడాడని, తన కోసం పరిశ్రమపై ఆంక్షలు విధించొద్దన్నాడని, అవసరమైతే తన సినిమాలు ఆపుకోమని చెప్పాడని, ఇదంతా ఇండస్ట్రీ కోసం చేసినా, ఎవరూ ముందుకు రాలేదని, ఒక్క హీరో కూడా పవన్ కి అనుకూలంగా మాట్లాడలేదని గుర్తు చేశారు నాగబాబు. ఓ హీరో సినిమాని కావాలని అన్యాయంగా తొక్కేస్తోంటే, ఇండస్ట్రీలో ఇంత మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలూ ఉన్నా ఒక్కరూ స్పందించకపోవడం దారుణమన్నారు.

naga babu serious on tollywood
”చంపేస్తారని భయమా” అంటూ నేరుగానే ప్రశ్నించారు. ”మీ భయాల్ని, బలహీనతల్నీ మేం అర్థం చేసుకుంటాం. రేపు మీ సినిమాకి సమస్య వస్తే కల్యాణ్ బాబు ముందుంటాడు. ఎందుకంటే మీలా కల్యాణ్ భయస్తుడు కాదు” అంటూ ఓ చురక అంటించాడు నాగబాబు. సినిమా హిట్టయ్యింది కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు నాశనం అయిపోయేవారని, ఈ సినిమా ఫ్లాపయినా పవన్ కి నష్టం లేదని, ఓ సినిమా తీసి, పదిమందికీ ఉపాధి కల్పించాలన్న నిర్మాత మాత్రం దారుణంగా నష్టపోయేవాడని.. ఈపరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.