హాకీ ప్లేయర్ గా నాగ చైతన్య .. విక్రం కుమార్ చేసేది మళ్ళీ ప్రయోగమేనా ...? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

హాకీ ప్లేయర్ గా నాగ చైతన్య .. విక్రం కుమార్ చేసేది మళ్ళీ ప్రయోగమేనా …?

 Authored By govind | The Telugu News | Updated on :30 December 2020,2:00 pm

హాకీ ప్లేయర్ గా నాగ చైతన్య విక్రం కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మనం సినిమాతో మెగా ఫ్యామిలీ తో క్లోజ్ రిలేషన్ మేయింటైన్ చేస్తున్న విక్రం కుమార్ అక్కినేని హీరోలని ప్రత్యేకంగా చూపించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. వాస్తవంగా మనం సినిమా తో అక్కినేని ఫ్యామిలీకి లైఫ్ టైం గిఫ్ట్ ఇచ్చాడు విక్రం కుమార్. దాంతో మరోసారి అక్కినేని ఫ్యామిలీ తో మనం సీక్వెల్ చేయాలన్న చర్చలు కూడా జరిగాయట. కాని ఎందుకనో మనం సీక్వెల్ మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే అక్కినేని హీరోలతో మాత్రం విక్రం కుమార్ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

Akkineni Akhil Movies List

అఖిల్ తో హలో సినిమా చేశాడు విక్రం కుమార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వాస్తవంగా ఈ సినిమా మీద భారీగానే అంచనాలు నెలకొన్నాయి. సినిమా కథ బాగానే ఉన్నప్పటికి ఎందుకనో తెలుగు ప్రేక్షకులకి ఆ సినిమా ఎక్కలేదు. దాంతో మనం తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అంచనాలు ఎక్కువగా ఉండటం కూడా ఒక మైనస్ గా మారింది. అప్పటి నుంచి విక్రం కుమార్ .. మళ్ళీ అక్కినేని ఫ్యామిలీ హీరోలకి హిట్ ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. ఎట్టకేలకి ఇన్నాళ్ళకి నాగ చైతన్య తో సినిమా చేస్తున్నాడు.

Hello Censor Report | nowrunning

థ్యాంక్యూ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు. మజిలీ సినిమాలో క్రికెటర్ గా నటించి హిట్ కొట్టాడు చైతూ. ఇప్పుడు హాకీ ప్లేయర్ గా నటిస్తుండటంలో బాగానే అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఆ ప్రయోగం ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ఇద్దరు హీరోయిన్స్ కి కూడా ప్లేస్ ఉందట. మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది