Naga Chaitanya : అమీర్ ఖాన్ తో కలిసి నాగ చైతన్య బాలీవుడ్ సినిమా చేయడానికి కారణమేంటో తెలుసా?
Naga Chaitanya : అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య ఇటీవల వరుస హిట్లతో మంచి జోరు మీదున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకున్న నాగ చైతన్య త్వరలో థాంక్యూ అనే సినిమాతో పలకరించనున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ చిత్రంతో పలకరించబోతున్నాడు చైతూ. అయితే ఈ సినిమాలో నటించడానికి ఒక వ్యక్తి కారణమని చైతూ ఇటీవల బయటపెట్టాడు.అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ నటిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. ఈ సినిమాలో అమీర్ ఖాన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం నాగచైతన్యను సంప్రదించగా..
తాను కూడా ఓకే చెప్పాడు. కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసేసుకున్నాడు చైతూ. దాని తర్వాత తన సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు అమీర్.. చైతూకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపాడు. అయితే ఫారెస్ట్ గ్రంప్ సినిమా తనకు చాలా ఇష్టమని, దాని రీమేక్‌లో నటించే అవకాశం వచ్చినందుకు తాను చాలా హ్యపీగా ఫీల్ అవుతున్నానని అన్నాడు చైతూ.లాల్ సింగ్ చడ్డాలో నటించడానికి ముఖ్య కారణం అమీర్ ఖాన్ అన్న విషయాన్ని బయటపెట్టాడు నాగచైతన్య. అమీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని, తన నుండి నేర్చుకునే అవకాశాన్ని చైతూ వదులుకోవాలని అనుకోలేదని తెలిపాడు.

naga chaitanya reveals why he agreed to do aamir khan movie
Naga Chaitanya : అసలు ట్విస్ట్ ఇదా..!
అమీర్ సెట్‌లో చాలా ఫన్నీగా ఉంటాడు అన్నాడు చై. పైగా ఇది తనకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14 న విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్దం అయింది. మరోవైపు చైతూ ఓ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ హారర్ కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని సమాచారం. దీన్ని అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తోందట. ఈ వెబ్ సిరీస్‌కి ‘దూత’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కథ ప్రకారం ఈ హారర్ థ్రిల్లర్‌లో ఓ దూతగా కనిపించబోతున్నారట నాగ చైతన్య. ఆత్మలతో మాట్లాడి మానవులకు సందేశం ఇచ్చే దూతగా ఆయన కనిపిస్తారట.