Naga Chaitanya Shobhita : నాగ చైతన్య – శోభిత ప్రేమాయణం ఇలా జరిగిందా..!
ప్రధానాంశాలు:
Naga Chaitanya Shobhita : నాగ చైతన్య - శోభిత ప్రేమాయణం ఇలా జరిగిందా..!
Naga Chaitanya Shobhita : చైతూతో లవ్ ట్రాక్ ఎలా మొదలైందో శోభిత సోషల్ మీడియా ద్వారా తెలిపింది. పెళ్లి తర్వాత తొలిసారి ఓ ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందని ఓపెన్ అయ్యింది శోభిత. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లినట్లు శోభిత తెలిపారు. తాను ఎప్పుడూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటానని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్ తనను అడిగాడని వెల్లడించింది. ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్‌కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని.. దాంతో తాను కూడా చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.

Naga Chaitanya Shobhita : నాగ చైతన్య – శోభిత ప్రేమాయణం ఇలా జరిగిందా..!
Naga Chaitanya Shobhita నాగ చైతన్య – శోభిత లవ్ ట్రాక్ రివీల్
2022 ఏప్రిల్ తర్వాత చైతూతో తన స్నేహం మొదలైనట్లు ..అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది. తెలుగులో మాట్లాడమని నాగచైతన్య తనని తరచూ అడిగేవారని.. అలా మాట్లాడటం వల్ల తమ బంధం మరింత బలపడిందని చెప్పారు. మొదటిసారి ముంబై లోని ఓ కేఫ్‌లో చైతన్యను కలిసినట్లు చెప్పారు. అప్పుడు చైతన్య హైదరాబాద్, తాను ముంబైలో ఉన్నామని.. తన కోసం హైదరాబాద్ నుంచి ముంబై వచ్చేవారని తెలిపింది. మొదటిసారి తామిద్దరం బయటకు వెళ్లినప్పుడు తాను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్‌లో ఉన్నాడని వెల్లడించింది.
ఇక నాగచైతన్య కుటుంబం తనను న్యూ ఇయర్ వేడుకలకు ఆహ్వానించినట్లు శోభిత తెలిపారు. ఆ మరుసటి సంవత్సరం తన కుటుంబాన్ని చైతన్య కలిసినట్లు చెప్పారు. అలా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రపోజల్ చేశారని సీక్రెట్ రివీల్ చేసింది. మొత్తం మీద పెళ్లి చేసుకొని ఈ జంట ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క మొన్నటి వరకు వరుస ప్లాప్స్ తో ఉన్న చైతు తాజాగా తండేల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.