Naga Chaitanya : అఫీషియల్… శోభితతో నాగ చైత‌న్య ఎంగేజ్‌మెంటు.. మ‌రి పెళ్లి ఎప్పుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Naga Chaitanya : అఫీషియల్… శోభితతో నాగ చైత‌న్య ఎంగేజ్‌మెంటు.. మ‌రి పెళ్లి ఎప్పుడు..!

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్స‌మ్ ప‌ర్స‌న్ నాగ చైత‌న్య గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.కొన్నేళ్ల క్రితమే సమంత రూత్ ప్రభును అక్కినేని నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడిపోవడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని హీరో మరో హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం జరుగుతుండ‌గా, ఇప్పుడు అది నిజం అయ్యేలా క‌నిపిస్తుంది.నాగ చైతన్య – తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు చాన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇవి […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 August 2024,5:46 pm

ప్రధానాంశాలు:

  •  Naga Chaitanya : ఆమెతో ఈ రోజు నాగ చైత‌న్య ఎంగేజ్‌మెంటా.. మ‌రి పెళ్లి ఎప్పుడు..!

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్స‌మ్ ప‌ర్స‌న్ నాగ చైత‌న్య గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.కొన్నేళ్ల క్రితమే సమంత రూత్ ప్రభును అక్కినేని నాగ చైతన్య ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడిపోవడం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని హీరో మరో హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ప్రచారం జరుగుతుండ‌గా, ఇప్పుడు అది నిజం అయ్యేలా క‌నిపిస్తుంది.నాగ చైతన్య – తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు చాన్నాళ్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమే అంటూ కొన్ని వెకేషన్ పిక్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. తాజాగా నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం వార్త వైరల్ అవుతోంది.

Naga Chaitanya కొత్త లైఫ్‌లోకి చై…

సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత అక్కినేని నాగ చైతన్య ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే శోభితతోనే అతడు ఏడు అడుగులు నడుస్తాడని టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ నిజంగానే పెళ్లికి రెడీ అయ్యారట. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. త్వరలోనే శోభిత, చైతన్య వివాహం చేసుకోబోతున్నారట. చాలా ఏళ్లుగా ఒంటరిగా ఉంటోన్న నాగ చైతన్య.. శోభిత ధూళిపాళ్లతో నడుపుతున్న లవ్ స్టోరీ గురించి తన పేరెంట్స్‌కు చెప్పినట్లు తాజాగా ఒక సమాచారం వైరల్ అవుతోంది. అలాగే, ఆ హీరోయిన్ కూడా తన వాళ్లను ఒప్పించిందట. దీంతో వీళ్లిద్దరి పెళ్లికి రెండు ఫ్యామిలీలు ఒప్పుకున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు (గురువారం) వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరగనుందట.

Naga Chaitanya శోభితతో నాగ చైత‌న్య ఎంగేజ్‌మెంటు మ‌రి పెళ్లి ఎప్పుడు

Naga Chaitanya : శోభితతో నాగ చైత‌న్య ఎంగేజ్‌మెంటు.. మ‌రి పెళ్లి ఎప్పుడు..!

తాజాగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ వార్తలే కనిపిస్తున్నాయి. వీరిద్దరికీ ఈరోజే (ఆగస్టు 8) నిశ్చితార్థం జరగబోతుందంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కానీ దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోను నాగార్జున త్వరలోనే సోషల్ మీడియాలో పంచుకుంటారంటూ కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై అక్కినేని ఫ్యామిలీ ప్రకటన చేస్తుందంటున్నారు. మరోవైపు గతంలో చాలా సార్లు తాను ఏ యాక్టర్‌తోనూ తాను డేటింగ్ చేయనని శోభిత పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం చిన్న హింట్ ఇచ్చింది. కాలంతో పాటు మనుషులు కూడా మారతారని.. వారి అభిరుచులు కూడా మారుతుంటాయని చెప్పుకొచ్చింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది