Thandel : తండేల్ కి టికెట్ రేట్లు పెంచారోచ్.. ఏపీలో ఓకే తెలంగాణాలో నాట్ ఓకే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Thandel : తండేల్ కి టికెట్ రేట్లు పెంచారోచ్.. ఏపీలో ఓకే తెలంగాణాలో నాట్ ఓకే..!

 Authored By ramesh | The Telugu News | Updated on :5 February 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Thandel : తండేల్ కి టికెట్ రేట్లు పెంచారోచ్.. ఏపీలో ఓకే తెలంగాణాలో నాట్ ఓకే..!

Thandel : నాగ చైతన్య Naga Chaitanya తండేల్ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ సినిమా రిలీజ్ సందర్భంగా వారం పాటు టికెట్ రేట్లను పెంచుతూ జీఓ పాస్ చేసింది. నగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాను చందు మొండేటి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ తో ఇప్పటికే సినిమాకు సూపర్ హిట్ వైబ్ వచ్చేసింది. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోయింది. ఐతే సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్న తరుణంలో సినిమా టికెట్ ప్రైజ్ కూడా పెంచేశారు. తండేల్ సినిమాకు ఏపీలో సింగిల్ స్క్రీన్ లకు 50 రూ.లు, మల్టీప్లెక్స్ లకు అయితే 75 రూపాయలు పెంచారు. వారం పాటు ఈ పెరిగిన రేట్లతో తండేల్ సినిమా ప్రదర్శించబడుతుంది.

Thandel తండేల్ కి టికెట్ రేట్లు పెంచారోచ్ ఏపీలో ఓకే తెలంగాణాలో నాట్ ఓకే

Thandel : తండేల్ కి టికెట్ రేట్లు పెంచారోచ్.. ఏపీలో ఓకే తెలంగాణాలో నాట్ ఓకే..!

Thandel : మాస్ స్టామినా చూపించేలా..

తండేల్ సినిమాకు అన్నీ అలా కలిసి వస్తున్నాయి. సినిమా రిలీజ్ ముందే ఆల్బం సూపర్ హిట్ కాగా ప్రీ రిలీజ్ హంగామా కూడా బాగుంది. ఐతే అక్కినేని నాగ చైతన్య ఈసారి తన మాస్ స్టామినా చూపించేలా ఉన్నాడని అనిపిస్తుంది. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.

తండేల్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచారు కానీ తెలంగాణాలో మాత్రం పెంచలేదు. ఆల్రెడీ పుష్ప 2 సినిమా ప్రివ్యూ టైం లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల తెలంగాణాలో ఇక బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లు పెంచడం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏపీలో మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రతి సినిమాకు మంచి అవకాశం ఇస్తున్నారు. మరి టికెట్ రేట్లు పెరిగాయి కాబట్టి తండేల్ కి భారీ కలెక్షన్స్ వస్తాయా లేదా అన్నది చూడాలి. Naga Chaitanya, Thandel, Sai Pallavi, AP Government, DSP

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది