Naga Chaitanya : చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ని మించిపోయిన నాగ చైత‌న్య‌.. ఎందులో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Updated on: July 25, 2022, 11:48 pm

Naga Chaitanya : మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌, వాళ్ల క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి మెగాస్టార్‌గా ఉన్న‌త శిఖ‌రాల‌ను అందుకోగా, ఆయ‌న త‌న‌యుడిగా చ‌ర‌ణ్ త‌నలోని టాలెంట్ చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. వీరిద్ద‌రిని మించి నాగ చైత‌న్య ఉన్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది విని అంద‌రు షాక్ అవుతున్నారు. ఏ విష‌యంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌ను నాగ చైత‌న్య మించిపోయాడా అని అంద‌రు త‌లలు ప‌ట్టుకుంటున్నారు. నాగ చైత‌న్య సినిమాలు, ఆయ‌న‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తూ మెగా హీరోల‌ని దాటే ఛాన్స్ లేదు. కాని ఓ విష‌యంలో మాత్రం మించిపోయాడు.

Naga Chaitanya : చైతూ బెట‌ర్..

నాగచైతన్య న‌టించిన తాజా చిత్రం ‘థాంక్యూ’ . భారీ అంచనాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ నష్టాల్ని చవిచూడటం ఖాయమైపోయింది. నాలుగో రోజు ఉదయం ఆట వసూళ్ళకు సంబంధించి హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోగల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ‘థాంక్యూ’ సినిమా కేవలం 12,440 రూపాయలు మాత్రమే రాబట్టింది. ‘ఆచార్య’ సినిమా ఇదే రోజు, ఇదే షోకి 12,309 రూపాయలతో సరిపెట్టడం గమనార్హం. ఇలా చూస్తే రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి ఆచార్య క‌న్నా కూడా చైతూ మూవీ కాస్త బెట్ట‌ర్ అని అక్కినేని అభిమానులు సంతృప్తి చెందుతున్నారు.

Naga Chaitanya Thank You Movie collections

Naga Chaitanya Thank You Movie collections

ఆచార్య నష్టాలు చిరంజీవి, కొరటాల శివ మెడకు బిగుసుకున్నాయి. ఆచార్య విషయంలో దర్శకుడిగానే కాకుండా నిర్మాణంలోనూ అంతా తానై చూసుకున్నాడు కొరటాల. బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంది కొరటాల శివనే అని తెలుస్తోంది. అందుకే ఈ భారీ నష్టాలను పూడ్చే బాధ్యత కూడా కొరటాల శివ మీదే పడిందని టాక్. అయితే ఆచార్య చిన్న నష్టాలేమీ మిగల్చలేదు. దాదాపు 80 నుంచి వంద కోట్ల వరకు నష్టాలు మిగిల్చిందని తెలుస్తోంది.అయితే చిరంజీవి సినిమాని న‌మ్ముకున్న వాళ్ల‌కు త‌న వంతు సాయం చేసిన‌ట్టు తెలుస్తుంది.ఇక రీసెంట్‌గా ఓ ప్రెస్ మీట్‌లో ఆచార్య పేరు ప్రస్తావించకపోయినా.. ఆయన ఆ మూవీ ఫెయిల్యూర్ గురించే మాట్లాడారు. ఆచార్య ఎఫెక్ట్ చిరు సినిమాపై చాలా ప‌డింది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp