Naga Chaitanya : అర్థం కాని నాగ చైతన్య ట్వీట్.. జుట్టు పీక్కుంటున్న నెటిజన్లు..
Naga Chaitanya.. టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. సమంత విడాకుల ప్రకటన వచ్చిన కాన్నుంచి ఏదో విధంగా సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తపరుస్తూ వస్తోంది. కానీ నాగ చైతన్య మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. అదీ కాక నాగ చైతన్య ముందు నుంచే సోషల్ మీడియాను ఎక్కువగా వాడరు.
కానీ నాగ చైతన్య మాత్రం ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు చాలా ఆతృతగా రియాక్ట్ అవుతున్నారు. విడాకుల దగ్గరి నుంచి నాగ చైతన్య నుంచి ఎటువంటి అప్డేట్ అయినా వస్తుందా? అని ఎదురు చూశారు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా బిజీగా మారాడు. లవ్ స్టోరీ సక్సెస్ మరియు నాగ చైతన్య కొత్త సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
#Grazievale అంటూ ట్వీట్…
నెటిజన్లకు ఈ రోజు నాగ చైతన్య ట్విటర్ లో ఓ కొత్త ట్వీట్ కనిపించే సరికి అసలు నాగ చైతన్య దేని గురించి ట్వీట్ చేశాడా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇన్నాళ్లు ఎదురు చూసిన అభిమానులకు బిగ్ షాక్ ఇస్తూ నాగ చైతన్య ట్వీట్ చేశారు. అతడు ఎవరికీ అర్థం కాని రీతిలో ఓ ట్వీట్ పెట్టాడు. అసలు అది ఏం ట్వీటా అని అభిమానులు తెగ ఎంక్వైరీ చేశారు.
అనేక విధాలుగా ఆరా తీసిన అభిమానులకు చివరికి కొంత మంది ఫ్యాన్స్ కామెంట్స్ ద్వారా అసలు విషయం తెలిసింది. నాగ చైతన్య ట్వీట్ చేసింది. ప్రముఖ రేసర్ గ్రేజీవాలే గురించి. గ్రేజీవాలే రేసింగ్ లో చాలా ఫేమస్ . అతడు రేసింగ్ మొదలుపెట్టాడంటే తప్పకుండా విన్ అయి తీరాల్సిందేనట. అతడు ఈ రోజు తన చివరి రేస్ ఆడుతున్నాడట. అందుకోసమే నాగ చైతన్య ట్వీట్..