Naga Chaitanya : నాగ చైతన్య చేసుకోబోయే శోభిత బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా ? ఆస్తులు బాగానే ఉన్నాయి..!
Naga Chaitanya : టాలీవుడ్‌కు చెందిన సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఎంతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికేశారు. ఇక కొన్నాళ్ల పాటు సింగిల్‌గా ఉన్న చైతూ.. శోభితతో ప్రేమాయణం నడిపాడు. ఇక తాజాగా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. అక్కినేని నాగార్జున వారి ఎంగేజ్‌మెంట్ పిక్స్ […]
ప్రధానాంశాలు:
Naga Chaitanya : నాగ చైతన్య చేసుకోబోయే శోభిత బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా? ఆస్తులు బాగానే ఉన్నాయి..!
Naga Chaitanya : టాలీవుడ్‌కు చెందిన సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి ఎంతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికేశారు. ఇక కొన్నాళ్ల పాటు సింగిల్‌గా ఉన్న చైతూ.. శోభితతో ప్రేమాయణం నడిపాడు. ఇక తాజాగా ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. అక్కినేని నాగార్జున వారి ఎంగేజ్‌మెంట్ పిక్స్ షేర్ చేయగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో శోభిత గురించి నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు.
Naga Chaitanya ఇది శోభిత బ్యాక్‌గ్రౌండ్..
శోభిత తెలుగు అమ్మాయి. ఆమెది గుంటూరు జిల్లా తెనాలి. 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం శోభిత వెలుగులోకి వచ్చారు. 2016లో బాలీవుడ్‌లో రోమన్ రాఘవ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. 2018లో అడవి శేషు నటించిన గూఢచారి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మేజర్ మూవీలోనూ కీలక పాత్ర పోషించారు. సమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్యకు పరిచయం ఏర్పడిందనే ఓ రూమర్ ఉంది.. వేణుగోపాలరావు – శాంత దంపతుల కుమార్తె శోభిత జన్మించింది. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్ – విశాఖ వ్యాలీ స్కూల్ లో ఆమె చదువుకుంది. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ – ఎకనామిక్స్ పూర్తి చేసింది. క్లాసికల్ డాన్స్ లో ఆమె కూచిపూడి, భరత నాట్యం రెండు నేర్చుకుంది.. ఆతరువాత 2013 ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది.
2016లో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో రామన్ రాఘవ సినిమాలో నటించింది. . అడివి శేష్ జంటగా గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించి హిట్లు కొట్టింది. ఇక మణిరత్నం ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వమ్ లో కూడా శోభిత నటించింది. ఒక అంచనా ప్రకారం శోభితకు రూ. 7-10 కోట్ల ఆస్తులు ఉన్నాయి. శోభిత తండ్రి మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా, తల్లి ప్రాధమిక పాఠశాల ఉపాథ్యాయురాలిగా పని చేశారు. శోభిత 16 ఏళ్ల వరకు వైజాగ్‌లోనే ఉండగా, అనంతరం ముంబై వెళ్లింది.