Neha Shetty : హీరోయిన్ పుట్టు మచ్చల గురించి జర్నలిస్ట్ ప్రశ్న.. క్షమాపణలు చెప్పిన భీమ్లా నాయక్ నిర్మాత
Neha Shetty : సిద్ధు జొన్నలగడ్డ – నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డీజే టిల్లు. ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర ప్రధాన తారాగణం సిబ్బంది హాజరై మీడియాతో ముచ్చటించారు. విలేఖరులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. అయితే హీరోని ఓ ప్రముఖ జర్నలిస్టు అడిగిన వల్గర్ ప్రశ్నపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.”డీజే టిల్లు” ట్రైలర్ లో ‘నీ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి?’ అని హీరో అడగగా.. దానికి హీరోయిన్ ‘పదహారు’ అని సమాధానం చెప్తుంది.
మీడియా ఇంటరాక్షన్ సమయంలో ఈ డైలాగ్ ని గుర్తుచేసిన ఓ విలేఖరి.. ”హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పించారు కదా.. హీరోయిన్ కు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో రియల్ గా తెలుసుకున్నారా?” అని హీరో సిద్ధు జొన్నలగడ్డని ప్రశ్నిస్తూ ఓ నవ్వు నవ్వాడు. దీనికి కంగుతిన్న సిద్దు ఈ ప్రశ్నకు తాను దూరంగా ఉండాలని అనుకుంటున్నానని స్పాంటేనియస్ గా సమాధానం చెప్పాడు.ప్రెస్ మీట్ తర్వాత ఆ క్లిప్పింగ్‌ని హీరోయిన్ నేహా శర్మ తన సోషల్ మీడియాలో జత చేస్తూ.. ”ఈరోజు ట్రైలర్ లాంచ్ లో ఇలాంటి ప్రశ్న వినాల్సి రావడం చాలా దురదృష్టకరం. కానీ అది తన వర్క్ ప్లేస్ లో..ఇంట్లో తన చుట్టూ ఉన్న స్త్రీల పట్ల తనకున్న గౌరవాన్ని సులభతరం చేస్తుందని నేను చెప్పాలి” అని పేర్కొంది.
Neha Shetty : నేహాకి అంత కోపం ఎందుకొచ్చింది..
అయితే హీరోయిన్‌కు కలిగిన అసౌకర్యానికి నిర్మాత నాగవంశీ స్పందించాడు. క్షమించండి.. ఇది చాలా దురదృష్టకరమే అని అన్నాడు. ఇక మీడియా అడిగిన ఓ ప్రశ్నకు నాటుగానే సమాధానం చెప్పాడు నాగ వంశీ. డీజే టిల్లు మీ బయోగ్రఫీనా? అని అడిగితే. కాదండి.. అయినా ఇంత మంచి హీరోయిన్‌తో ముద్దు అంటే నటించడానికి నాకు ఓకే అని కాస్త రొమాంటిక్‌గా ఆన్సర్ ఇచ్చాడు. అయితే నేహా ట్వీట్ కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి మద్దతు లభిస్తోంది. జర్నలిజం అంటే ఇదేనా అంటూ మరికొందరు సదరు విలేఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు.