Nagarjuna : జగన్, నాగార్జున మద్య ఇంత బంధం ఉందా.. ఇదే సాక్ష్యం
Nagarjuna : సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడటంతో ఒకే ఒక్క బంగార్రాజు పెద్ద సినిమాగా విడుదల కాబోతుంది. బంగార్రాజు సంక్రాంతి సీజన్ లో నాలుగు అయిదు రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడితే చాలు వసూళ్లు కుమ్మేసుకోవచ్చు అంటూ అంతా అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నైట్ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో బంగార్రాజు బేజారు అయ్యాడు. ఏపీ మార్కెట్ పై బంగార్రాజు ఆశలు వదిలేసుకోవాల్సిందే అనుకున్నారు.
తెలుగు సినిమాకు అత్యంత కీలకమైన ఆంద్రా మరియు సీడెడ్ లను వదిలేస్తే నైజాం లో వచ్చేది ఎంత అంటూ ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా బంగార్రాజు టీమ్ మయ జోరుగా ప్రచారం అయితే చేశారు. ప్రచారం ఎక్కడ ఆపకుండా కంటిన్యూ చేసిన బంగార్రాజు టీమ్ కు ఏపీ ప్రభుత్వం నుండి సవరణ తో గుడ్ న్యూస్ అందింది. సంక్రాంతి సీజన్ అవ్వడం వల్ల ఇప్పుడు నైట్ కర్ఫ్యూ ను అమలు చేయడం లేదు. సామాన్య జనాలు ఇబ్బంది పడకూడదు అని.. ప్రయాణాలు చేసే వారికి అసౌకర్యం కల్పించకూడదు అనే ఉద్దేశ్యంతో సంక్రాంతి సీజన్ పూర్తి అయిన తర్వాత కర్ఫ్యూ ను అమలు చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Nagarjuna : బంగార్రాజు కోసమే జగన్ ఆ నిర్ణయం..
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ఎంత వరకు ఉపయోగమో కాని నాగార్జున బంగార్రాజుకు మాత్రం బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. నైట్ కర్ఫ్యూ ను వెనక్కు తీసుకోవడం మాత్రమే కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో బంగార్రాజు తీన్మార్ వేస్తున్నాడు. ఆ నాలుగు రోజుల్లో బంగార్రాజు పూర్తి మొత్తంను రాబట్టుకోగలడు. కేవలం బంగార్రాజు కు మాత్రమే కాకుండా సంక్రాంతికి విడుదల కాబోతున్న అన్ని సినిమాలకు ఇది ఉపయోగదాయకం కాబోతుంది.
నాగార్జున మరియు వైఎస్ జగన్ ల మద్య ఉన్న బంధంకు అనుబంధంకు ఇదే నిదర్శణం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రభుత్వం లో ఉన్న నాగ్ సన్నిహితులు మరియు ముఖ్య మంత్రి కూడా నాగ్ కు ఆప్తుడు అవ్వడం వల్లే బంగార్రాజు కోసం నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం అయిన తర్వాత చాలా సార్లు జగన్ మోహన్ రెడ్డిని నాగార్జున కలవడం జరిగింది. ఇద్దరి కాంబోలో పలు సార్లు మీటింగ్ జరిగింది. అలా నాగ్ కు జగన్ కు అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే ఇప్పుడు బంగార్రాజు చిత్రం కోసం జగన్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.