Bigg Boss Telugu 7 : నేను గర్వంగా చెబుతున్నా మా నాన్న ఊరోడు.. ప్రశాంత్ పరువు అడ్డంగా తీసేసిన నాగ్.. దెబ్బకు నోర్మూసుకున్న ప్రశాంత్
Bigg Boss Telugu 7 : నేను గర్వంగా చెబుతున్నా మా నాన్న ఊరోడు అని అన్నది ఎవరో కాదు.. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. ఈ శనివారం బిగ్ బాస్ కంటెస్టెంట్లపై నాగార్జున ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఎందుకంటే ఈ వారం బిగ్ బాస్ కంటెస్టెంట్లు చాలా తప్పులు చేశారని చెప్పుకోవచ్చు. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల తప్పులను కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు కింగ్ నాగ్. ఒక్కొక్కరి గురించి కొన్ని నిజాలు చెప్పాలి అంటూ ఒక్కొక్కరి కుండ కొట్టి మరీ చెప్పుకొచ్చారు నాగ్. అశ్వని అసలు నువ్వు ఏం మాట్లాడుతావో ఒక్కోసారి అర్థం కాదు. అరేయ్.. పోరా.. గీరా అంటూ నువ్వు మాట్లాడే మాటలు బాగాలేవు అంటూ సీరియస్ అవుతాడు నాగ్. ఎందుకు చేశావమ్మా అలా.. ఏం చేశావో నీకు తెలియట్లేదు. నువ్వు మాట్లాడే పద్ధతి బాగోలేదు అని సీరియస్ అవుతాడు నాగ్.
మన ఊళ్లో మన ఇంట్లో మనం వాడుకునే పదాలు కొన్ని ఉండొచ్చు. కానీ.. ఎర్రగడ్డ అనే పదం ఎందుకు వచ్చింది అంటూ శోభాశెట్టిని ఉద్దేశించి భోలే షావలి చేసిన వ్యాఖ్యల గురించి ఏకంగా భోలేను నిలదీస్తాడు నాగ్. తను సెన్స్ లెస్ అని అన్నది అందుకే.. నేను ఆ పదం వాడాల్సి వచ్చింది అంటే.. సెన్స్ లెస్ కి మెంటల్ కి చాలా తేడా ఉంది కదా అని భోలాపై సీరియస్ అవుతాడు నాగ్. ఆ తర్వాత ప్రియాంకను పిలిచి మాట జారిన తర్వాత క్షమాపణ అడిగినా వర్కవుట్ అవ్వదు అని అంటాడు నాగ్. ఆ తర్వాత కేక్ విషయంలో శోభాశెట్టి, అమర్ మధ్య జరిగిన విషయం గురించి మాట్లాడుతాడు నాగ్. సింపుల్ శోభా.. అమర్ అలా తినేసినప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు కంప్లయింట్ చేయలేదు. గ్రూప్ ఇజమా? కేక్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. తేజ నీనుంచి ఇది ఊహించలేదు. రెచ్చగొట్టేయడం ఒకరిని.. శాడిజం ఎక్కువగా ఉంది అంటూ తేజకు కూడా షాకిస్తాడు నాగ్.
Bigg Boss Telugu 7 : సందీప్ ఒట్టేశాడు.. మరి నువ్వెందుకు వేయలేదు
సందీప్ ఒట్టేశాడు కదా.. మరి నువ్వెందుకు వేయలేదు అని ప్రశాంత్ పై సీరియస్ అవుతాడు నాగ్. ప్రశాంత్.. ఒకరి మీద నింద వేసేటప్పుడు అది నిజం అయి ఉండాలి. ఊరోడు అంటే నీకు తప్పా. అందరూ ఊరి నుంచే వచ్చారు కదా. ఇవాళ అందరికీ తిండిపెట్టేది ఊరే. నేను గర్వంగా చెబుతున్నాను.. మా నాన్న ఊరోడు. గర్వంగా చెబుతున్నాను. దాంట్లో తప్పే లేదు.. అంటూ ప్రశాంత్ పై సీరియస్ అవుతాడు నాగ్.