Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్.. ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు. నిజానికి.. రైతు బిడ్డ కాబట్టే నేడు ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. వేరే వ్యక్తి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఉండేది కాదు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రశాంత్ బిహేవియర్ చూసి చాలామంది షాక్ అయ్యారు. ఒక రైతు బిడ్డ ఏంటి ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు అని అందరూ అనుకున్నారు. హౌస్ లో అడుగు పెట్టిన వారం రోజులు బిగ్ బాస్ హౌస్ లో రతిక వెంటే పడ్డాడు. తనతోనే ఉండటం, తనతోనే తిరగడం, తనతోనే తినడం.. అన్నీ తనతోనే చేశాడు. చివరకు అది ఎంత దూరం వెళ్లిందంటే.. రైతు బిడ్డ ఏంట్రా బిగ్ బాస్ హౌస్ లో పులిహోర కలుపుతున్నాడు అంటూ నెటిజన్లు ప్రశాంత్ ను తీవ్రంగా ట్రోల్ కూడా చేశారు.

అసలు బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ చేసిన పని ఏంటి అంటే రతిక వెంట పడటం. అయితే.. ప్రశాంత్ బిహేవియర్ ఏదో తేడాగా ఉందని.. వారం రోజుల్లోనే రతిక.. ప్రశాంత్ కట్ చేసింది. నువ్వు రైతు బిడ్డవా.. రైతు బిడ్డ అయితే ఇలాగేనా చేసేది. ఫ్లయింగ్ కిస్ లు ఇవ్వడం, దిండు మీద పేరు రాయడం, నేను కేవలం ఫ్రెండ్ గానే చూశాను. కానీ నువ్వే హద్దులు దాటావు అంటూ చెంప మీద కొట్టినట్టుగా మాట్లాడటంతో దెబ్బకు మనోడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. వీకెండ్ లో నాగార్జున కూడా ప్రశాంత్ మీద సీరియస్ అయ్యాడు. నీ ఆట అంతా బాగానే ఉంది కానీ.. నువ్వు రైతు బిడ్డవు ఎలా అవుతావు. కనీసం ఇచ్చిన ఒక్క మొక్కను కూడా సరిగ్గా చూసుకోలేకపోయావు అంటూ సీరియస్ అయ్యాడు నాగార్జున.
Bigg Boss Telugu 7 : ప్రశాంత్ కు మరో చాన్స్ ఇచ్చిన నాగార్జున
అయితే.. ప్రశాంత్ కు ఇచ్చిన మొక్క ఎండిపోవడానికి కారణం ఎవరో నీళ్లు పోశారు అని చెబుతాడు ప్రశాంత్. దీంతో నాగార్జున.. ప్రశాంత్ కు రెండో చాన్స్ ఇస్తాడు. నువ్వు రైతు బిడ్డవు అని రుజువు చేసుకోవాలి. ఆ మొక్కను మంచిగా చూసుకోవాలి. ఆ మొక్క వాడిపోవద్దు. ఒకవేళ వాడిపోతే నామినేషన్స్ లో అందరూ చెప్పింది నిజమే అని నమ్ముతా అంటాడు. దీంతో ప్రశాంత్ కోసం బిగ్ బాస్ మరో మొక్కను పంపిస్తాడు. అలాగే.. రతిక విషయం గురించి కూడా ప్రస్తావిస్తాడు నాగార్జున. ఇద్దరి మధ్య లవ్ గురించి కూడా మాట్లాడాడు. నీకు ఈ మధ్యన ఒక పోటీ వచ్చింది కదా అంటాడు నాగార్జున. దీంతో అవును సార్ అంటాడు. అంతా ఆగమాగం చేస్తున్నావు. సరే చూద్దాం అంటాడు నాగార్జున.