Nagarjuna : అమ్మాయిల పిచ్చి రూమ‌ర్స్‌పై నాగార్జున క్లారిటీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagarjuna : అమ్మాయిల పిచ్చి రూమ‌ర్స్‌పై నాగార్జున క్లారిటీ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 December 2022,9:30 pm

Nagarjuna : టాలీవుడ్ లో నాగార్జున ను మన్మధుడు అని అంటారు. మహేష్ బాబు కంటే ముందు అందగాడు ట్యాగ్ నాగార్జునది అని చెప్పవచ్చు. అయితే ఆయనను బయట కూడా మన్మధుడు అని అంటారు. నాగార్జున తన సినీ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపారని టాక్ ఉంది. బాలీవుడ్ బ్యూటీ టబు తో నాగార్జునకి స్నేహానికి మించిన రిలేషన్ ఉందని ఓ టాక్ ఐతే ఉంది. టబుతో ఎఫైర్ నడిపిన నాగార్జున మీడియానుండి కొన్ని ప్రశ్నలు కూడా ఎదుర్కొన్నాడు. టబు నాకంటే నా వైఫ్ అమలకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన మా ఇంటికి వస్తుందని నాగార్జున చెప్పారు.

అయితే ఇంతకు నాగార్జునకు అమ్మాయిల పిచ్చి ఉందా లేదా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఈ ఆదివారం జరిగిన బిగ్బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఒక టాస్క్ ను కండక్ట్ చేశారు నాగార్జున. మూడు నెలలుగా బిగ్బాస్ హౌస్లో ఉంటున్న వారి పరిశీలన ఎలా ఉంది, ఇంట్లో వస్తువులు, పరిసరాలపై వాళ్లకు అవగాహన ఉందా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు. బిగ్ బాస్ హౌస్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తెలిసినవారు గంట కొట్టి సమాధానం చెప్పండి అని అంటారు. తప్పు చెబితే మైనస్ మార్క్స్ అని చెబుతాడు. అయితే ఈ టాస్క్ చేయబోయే ముందు నాగార్జున ఒక మాట చెబుతారు.

nagarjuna given clarity about rumours

nagarjuna given clarity about rumours

నేను అమ్మాయిల పక్షపాతినీ అన్నారు. వెంటనే నేను అమ్మాయిల పక్షపాతి ఆని మాత్రమే చెప్పాను, బలహీనత ఉందని చెప్పలేదు అని అన్నారు. అమ్మాయిల పక్షపాతి అనే పదం జనాలలోకి తప్పుగా వెళ్ళవచ్చు అని అమ్మాయిల పిచ్చి లేదని క్లారిటీగా చెప్పారు. బిగ్బాస్ వేదికపై ఇలాంటి స్టేట్మెంట్ చేయడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఎన్నో ఏళ్లుగా తనపై ఉన్న రూమర్స్ కి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం ఇనయ ఎలిమినేట్ అయింది. ఇక హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక ఈ బుధవారం మరో ఎలిమినేషన్ జరగనుందని నాగార్జున చెప్పారు. వచ్చే ఆదివారం ఫినాలే ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది