Bigg Boss 5 Telugu : మళ్లీ అడ్డంగా బుక్కైన యాంకర్ రవి.. నిలబెట్టి పరువుతీసిన నాగార్జున
Bigg Boss 5 Telugu : యాంకర్ రవి బిగ్ బాస్ ఇంట్లో రోజురోజుకూ దిగజారిపోతోన్నట్టు కనిపిస్తోంది. మాటలు మార్చడం, అందరి దగ్గరకి వెళ్లి ఉచిత సలహాలు ఇవ్వడం, ప్రతీ ఒక్కరినీ ప్రభావితం చేయడం, ఎవరి టాస్కు వారిని ఆడుకోనివ్వకుండా చేయడంతో యాంకర్ రవికి నెగెటివ్ ఇమేజ్ ఏర్పడుతోంది. అసలే ప్రియ, లహరి ఇష్యూతో రవి ఇమేజ్ టోటల్ డ్యామేజ్ అయింది. దాన్నుంచే రవి ఇంకా తేరుకోలేకపోతోన్నాడు. తాజాగా మరోసారి రవి బుక్కయ్యాడు.

Nagarjuna Humiliates Anchor Ravi In Bigg Boss 5 Telugu
బంగారు కోడిపెట్ట టాస్క్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో మిసెస్ ప్రభావతి పెట్టే గుడ్లను సేకరించుకోవాలి. వాటిపై తమకు ఇచ్చిన స్టిక్కర్లను అంటించాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అయితే మధ్యలో సిరికి సంబంధించిన స్టిక్కర్లను ఎవరో దొంగిలించారు. వాటిని రవి కనిపెట్టి సిరితో బేరం ఆడాడు. ఎక్కడున్నాయో చెబితే నాకేంటి? అని ఆమెతో బేరం కుదుర్చుకున్నాడు. అయితే ఆ స్టిక్కర్లను దొంగిలించింది ఎవరో మాత్రం ఇంత వరకు తెలియలేదు.
Bigg Boss 5 Telugu యాంకర్ రవి పరువుపాయే

Nagarjuna Humiliates Anchor Ravi In Bigg Boss 5 Telugu
షన్నుకు మాత్రం యాంకర్ రవి మీదే అనుమానం ఉంది. అమ్మ తోడు వేసి తీయలేదు అని చెబుతున్నాడు. ఒకవేళ అది అబద్దమని తేలితే ఇకపై ఎప్పుడూ అతని మాటలు నమ్మను అని షన్ను తెగేసి చెప్పాడు. అయితే నేడు కింగ్ హోస్ట్ నాగార్జున ముందు మాత్రం రవి గుట్టు బట్టబయలు అయ్యేలా కనిపిస్తోంది. నువ్ తీశావా? అని నాగ్ అడిగితే.. లేదు నాకు దొరికాయ్ అని కవర్ చేశాడు. దీంతో నాగర్జునతో పాటుగా అందరూ నవ్వేశారు. అలా మరోసారి యాంకర్ రవి ఇజ్జత్ పోయినట్టు అయింది.