Bigg boss 6 Telugu Nagarjuna : ఆ ‘జబర్దస్త్’ నటుడుంటే నేను యాంకరింగ్ చేయబోను.. నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్..?
Bigg boss 6 Telugu Nagarjuna : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున.. హీరో మాత్రమే కాదు.. మల్టీటాలెంటెడ్ పర్సన్ అని అందరికీ తెలుసు. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్‌కు హోస్ట్‌గా పని చేసిన నాగార్జున..సీజన్ సిక్స్‌కు కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇకపోతే సీజన్ 6.. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, తాజాగా సీజన్ సిక్స్ కంటెస్టెంట్స్‌లో ఒకరి పట్ల నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు.. నాగార్జున ఎందుకు సదరు పర్సన్ కంటెస్టెంట్‌గా ఉండటాన్ని తప్పుబడుతున్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.
‘బిగ్ బాస్’ టీఆర్పీ రేటింగ్స్ పెంచడంలో నాగార్జున పాత్ర గురించి అందరికీ తెలుసు. వీకెండ్స్‌లో వచ్చి కంటెస్టెంట్స్ తో మాట్లాడి.. వారి ఎమోషన్స్ ను బయటకు తీస్తుంటారు. ఈ క్రమంలోనే నాగ్ వేసే సెటైరికల్ జోక్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సీజన్ సిక్స్ బిగ్ బాస్ షో.. గత సీజన్స్‌కు భిన్నంగా ఉండబోతున్నది. ఈ సీజన్ 24 హవర్స్ ఓటీటీ షో. కాగా, గతంలో మాదిరిగా ఎపిసోడ్ ఓ గంటపాటు టెలికాస్ట్ అవడం కాకుండా 24 గంటలు డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ వేదికగా బిగ్ బాస్ షో టెలికాస్ట్ అవుతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Nagarjuna comments viral on bigg boss 6 Telugu contestant
Bigg boss 6 Telugu Nagarjuna : అలా చేసినందుకుగాను ఆ కంటెస్టెంట్‌కు నో చెప్తున్న నాగార్జున..!
ఇకపోతే సీజన్ సిక్స్ స్టార్ట్ కావడానికి ముందర నిర్వాహకులు సెలక్ట్ చేసిన కంటెస్టెంట్స్ గురించి హోస్ట్ నాగార్జునకు తెలిపినట్లు సమాచారం. కాగా, సెలక్ట్ అయిన కంటెస్టెంట్స్ ‘జబర్దస్త్’ ప్రోగ్రాం నుంచి సెలక్ట్ అయిన ఓ కంటెస్టెంట్ సీజన్ సిక్స్‌లో ఉంటే తాను యాంకరింగ్ చేయబోనని నాగార్జున నిర్వాహకులు చెప్పారట. ఇందుకుగల కారణం ఏంటంటే.. సదరు కంటెస్టెంట్ ‘జబర్దస్త్’ షోలో నాగార్జునను కించపరిచేలా స్కిట్ వేశాడట. ఆ విషయం మనసులో పెట్టుకుని నాగార్జున అలా చేస్తున్నారని, నిర్వాహకులకు పైవిధంగా అల్టిమేటం ఇచ్చారని టాక్. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలవుతున్నాయి. అయితే, ఇందులో నిజమెంత ఉందనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ వస్తే కాని స్పష్టంగా అర్థం కావు.