ss rajamouli : ఆ పాత్రతో అవకాశాలు తగ్గాయి.. రాజమౌళిపై నాగినీడు సంచలన కామెంట్స్..!
ss rajamouli : నటుడు నాగినీడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాగినీడును దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘మర్యాదరామన్న’ చిత్రంతో స్టార్ చేశాడు. అయితే, అలా స్టార్ చేయడం గురించి నాగినీడు రాజమౌళిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.మర్యాదరామన్న’ఫిల్మ్ కంటే ముందర నాగినీడు చాలా చిత్రాల్లో నటించినప్పటికీ ఈ చిత్రం ఆయన్ను బాగా పాపులర్ చేసింది. అయితే, తనను పాపులర్ చేసిన ఆ సినిమానే తన కెరీర్‌కు మైనస్ అయిపోయిందని వాపోయాడు నాగినీడు.
‘ ఇటీవల ‘ఆలీతో సరదాగా’ షోలో నాగినీడు తన సినిమా జర్నీ గురించి పంచుకున్నారు. ఆ వివరాల్లోకెళితే..టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘మర్యాదరామన్న’ ఫిల్మ్‌తో తనకు చాలా మంచి పేరు వచ్చిన మాట వాస్తవమేనని, కానీ, ఆ సినిమా తర్వాత తాను క్యారెక్టర్స్ కోసం చాలా మందిని తనంతట తాను అప్రోచ్ కావాల్సి వచ్చిందని నాగినీడు పేర్కొన్నాడు. పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన తర్వాత సాధారణ పాత్రలు ఇవ్వలేం అని నాగినీడు చెప్పి తమ సినిమాల్లో చాలా మంది అవకాశాలు ఇచ్చే వారు కాదట. అయితే, తన మనసులో తనకు ఎక్కువ క్యారెక్టర్స్ ప్లే చేయాలని ఉండేదని, క్యారేక్టర్ ఏదైతే ఏంటని ఉండేదని వివరించాడు. మొత్తంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా వల్ల తనకు కలిగిన ఆనందం, ఆ తర్వాత కలిగిన అసంతృప్తిని నాగినీడు షేర్ చేసుకున్నాడు.
ss rajamouli : రాజమౌళి సినిమాలో ఆకాశంలో హీరోలు.. ఆ తర్వాత అంతే సంగతులు..
ఇకపోతే తాను తన చేతికి స్టైల్ కోసమే తాయత్తులు కట్టుకున్నానని వివరించిన నాగినీడు.. రాజమౌళి సినిమాల్లో నటించిన స్టార్ హీరోలకు ఆ తర్వాత హిట్స్ రావన్న టాక్ ఉందని అన్నాడు. అది నిజమేనని అన్నాడు. ఎందుకంటే.. రాజమౌళి తన ఫిల్మ్స్‌లో హీరోలను ఆకాశంలో చూపిస్తాడని, ఆ రేంజ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన హీరోలు ఆ తర్వాత అంతస్థాయి క్యారెక్టర్స్‌లో కనిపించబోరు. దాంతో ఆటోమేటిక్‌గా తర్వాత ఫ్లాప్స్ వస్తుంటాయని చెప్పాడు.