Taraka Ratna : సినీ ఎంట్రీతోనే వర్డల్ రికార్డు సాధించిన తారకర్న… ఏ హీరోకి సాధ్యం కానీ చరిత్ర..!
Taraka Ratna : సినీ నటుడు నందమూరి తారకరత్న మరణించడం జరిగింది. దాదాపు 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. వ్యక్తిగతంగా అందరితో కలిసిపోయే మనస్తత్వం కావటంతో తారకరత్న మరణం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ తల్లడిల్లి పోతున్నారు. ఎలాగైనా తారకరత్ననీ కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు శాయశక్తుల కృషి చేశారు. చంద్రబాబు కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు అక్కడ ప్రభుత్వ అధికారులను అలెర్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో విదేశీ వైద్యుల చేత కూడా చికిత్స అందించారు. అయినా గాని తారకరత్న మరణించడం అందరిని దుఃఖంలోకి నెట్టేసింది.
ఇదిలా ఉంటే తారకరత్న 2001వ సంవత్సరంలో ఒకటో నెంబర్ కుర్రాడితో సినిమా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలు వయసులోనే సినిమా రంగంలో రావడం జరిగింది. తారకరత్న నటించిన మొత్తం సినిమాల లిస్టు.. ఒకటో నెంబర్ కుర్రోడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా, రాజా చెయ్యి వేస్తే, ఖయ్యూం భాయ్, దేవినేని, సారధి వంటి సినిమాలలో నటించడం జరిగింది. ఓటీటీలో నైట్ అవర్స్ అనే వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
కాగా అమరావతి సినిమాలో తారకరత్న నటించిన విలన్ పాత్రకు గాను నంది అవార్డు అందుకోవటం జరిగింది. ఆయన చివరి రోజుల్లో ఒకపక్క సినిమాలు మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తూనే రాజకీయాల్లో చురుగ్గా రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో తారకరత్న మరణించటంతో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.