Nani HIT 3 Trailer launch : అప్పుడు అమ్మాయి కోసం.. ఇప్పుడు మీకోసం వచ్చాను – నాని
ప్రధానాంశాలు:
Nani HIT 3 Trailer launch : అప్పుడు అమ్మాయి కోసం.. ఇప్పుడు మీకోసం వచ్చాను - నాని
Nani HIT 3 Trailer launch : నేచురల్ స్టార్ నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం హిట్ 3 ..ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. విశాఖలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నాని తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. “అప్పుడు అమ్మాయి ప్రేమ కోసం వచ్చాను.. ఇప్పుడు మీ ప్రేమ కోసం వస్తున్నాను. ఎక్కడికెళ్లినా అన్నగా, తమ్ముడిగా చూస్తారు.. కానీ వైజాగ్ వచ్చినపుడు మాత్రం అల్లుడిలా చూస్తారు” అంటూ ఆయన అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

Nani HIT 3 Trailer launch : అప్పుడు అమ్మాయి కోసం.. ఇప్పుడు మీకోసం వచ్చాను – నాని
Nani HIT 3 Trailer launch HIT 3 ట్రైలర్ రిలీజ్ వేడుకలో తన మాటలతో అదరగొట్టిన నాని
వాల్‌పోస్టర్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మే 1న రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో నాని, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ “అర్జున్ సర్కార్” పాత్రలో కనిపించనున్నాడు. హింసాత్మక సన్నివేశాల వల్ల సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది.
సోమవారం విడుదలైన ట్రైలర్‌లో నాని చెప్పిన “సార్ క్రిమినల్స్ ఉంటే భూమ్మీద 10 ఫీట్ సెల్‌లో ఉండాలి.. లేదంటే భూమిలోపల 6 ఫీట్ హోల్‌లో ఉండాలి..” అనే డైలాగ్ ప్రేక్షకుల్ని ఊపేస్తోంది. చాగంటి కోటేశ్వరరావు మాటలను మధ్యలో వినిపించడం, భావోద్వేగంతో కూడిన “పాపకి 9 నెలలు సార్…” అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. నానిలోని మాస్ యాంగిల్‌ను పూర్తిగా బయటకు తీస్తున్న ఈ చిత్రం నాని రేంజ్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి.