Naresh – Pavithra : రామారావు మూవీ థియేట‌ర్స్‌లో న‌రేష్‌, ప‌విత్ర‌.. ఈల‌లే ఈలలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naresh – Pavithra : రామారావు మూవీ థియేట‌ర్స్‌లో న‌రేష్‌, ప‌విత్ర‌.. ఈల‌లే ఈలలు

 Authored By sandeep | The Telugu News | Updated on :29 July 2022,7:20 pm

Naresh – Pavithra : కొద్ది రోజుల క్రితం న‌రేష్‌, ప‌విత్ర‌లు ఎంత పాపుల‌ర్ అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్క‌డ చూసిన వీరిద్ద‌రి గురించే చ‌ర్చ న‌డిచింది.వీరిద్దరి పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్న సమయంలోనే.. నరేష్ మూడవ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. నాకు విడాకులు ఇవ్వకుండా నా భర్త పవిత్రతో ఎలా కలిసి ఉంటాడంటూ ఆమె తెరపైకి వచ్చింది. ఇటీవల నరేష్, పవిత్రా లోకేష్‌లను మైసూర్‌లోని ఓ హోటల్‌లో గుర్తించిన రమ్యా.. పవిత్రపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రమ్య దాడిని ఏ మాత్రం పట్టించుకోకుండా… పవిత్ర, నరేష్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

వెళ్తూ వెళ్తూ నరేష్ తన భార్య రమ్యపై కీలక ఆరోపణలు కూడా చేశారు.ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందంటూ మీడియా ముందే అరుస్తూ విమర్శలు చేశారు. కొద్ది రోజులుగా న‌రేష్, ప‌విత్ర‌ల‌కు సంబంధించి ఏదో ఒక చ‌ర్చ న‌డుస్తుండ‌గా, తాజాగా వీరిద్ద‌రు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం నేడు విడుదలైంది. ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ నటించడం జరిగింది. వీరిద్దరూ అన్నా చెల్లెలు పాత్ర చేశారు. ఈ జంట‌ను చూడ‌గానే ప్రేక్ష‌కులు విజిల్స్ వేసి మోతెక్కించారు. చాలా థియేటర్స్ లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియా కామెంట్స్ ద్వారా తెలుస్తుంది.

naresh pavitra entertain theatres

naresh pavitra entertain theatres

Naresh – Pavithra : అలా సంద‌డి చేశారు..

అస‌లు ప‌విత్ర ఒక‌ప్పుడు చాలా మందికి తెలియ‌దు. న‌రేష్ వ్య‌వ‌హారంతోనే ఆమె లైమ్ లైట్‌లోకి వ‌చ్చింది.ఈమెపై న‌రేష్ మూడో భార్య దారుణ‌మైన కామెంట్స్ చేసింది. తాను సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మయినని.. ఎట్టిపరిస్థితుల్లోనూ విడకులకు అంగీకరించనని అన్నారు. తమ కొడుక్కి తండ్రి ప్రేమ, అండ కావాలని .. కనుక విడాకులు వద్దని అంటున్నాడని చెప్పారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ రూమ్ తీసుకున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రమ్య.. తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా, తల్లి పాత్రలు అనగానే మనకు టక్కున గుర్తిచ్చే పేర్లలో పవిత్రా లోకేష్ ఒకరు. ఎన్నో సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్‌లో ఆమె అందర్నీ ఆకట్టుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది