nayanathara-says he is her husband
Nayanathara: సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారకి ఉన్న స్టార్ డం గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో అలా అలా నెట్టుకొచ్చిన ఈమె ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో నిర్మాతలకి అందని ద్రాక్షపండులా మారింది. నయనతార డేట్స్ కావాలంటే సంవత్సరం ముందే ఆమెని సంప్రదించి అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతగా నయనతార క్రేజ్ సంపాదించుకుంది. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్ లాంటి స్టార్స్ వరకు అందరితోనూ నటించింది.
nayanathara-says he is her husband
అంతేకాదు గత కొంతకాలంగా నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రిఫరెన్స్ ఇస్తోంది. ఆ సినిమాల పరంగా కూడా నయన్ మంచి హిట్స్ అందుకుంటోంది. అలా ఆమె క్రేజ్ అంతకంతా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. సీనియర్ హీరోయిన్ అయ్యాక నెమ్మదిగా అవకాశాలు తగ్గడం మొదలవుతాయి. కానీ నయన్ కి మాత్రం అవకాశాలు పెరుగుతున్నాయి. పైగా ఆమె ప్రమోషన్స్ కి రాను అంటే కూడా పర్వాలేదనే నిర్మాతలు రెడీ అవుతున్నారు. కాగా ఈ మధ్య నయనతార తన పెళ్ళికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పి హాట్ టాపిక్ గా మారింది. ఇది చాలా మందికి సర్‌ప్రైజ్ అయితే కొంతమందికి మాత్రం షాకింగ్ విషయం.
nayanathara-says he is her husband
గతంలో నయనతార ప్రేమలో రెండుసార్లు విఫలమైంది. ఒకసారి శింబుతో, ఒకసారి ప్రభుదేవాతో. దాంతో నయన్ మీద నెగిటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి. ఆ తర్వాత దర్శక, నిర్మాత విగ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. చాలాకాలంగా వీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. దాంతో ఈ బంధం ఎప్పుడు బెడిసికొడుతుందో అని మాట్లాడుకున్నారు.
nayanathara-says he is her husband
కానీ ఇటీవల ఆమెకి విగ్నేష్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది అంటూ రింగ్ చూపించి క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ వేడుకకి ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే హాజరయ్యారని చెప్పింది. అంతేకాదు ఇప్పటి వరకు చాలా రూమర్స్ రాశారు. ఇకపై విగ్నేష్ మాయన..ఇప్పుడు రాసుకోండి ఏం రాసుకుంటారో అంటూ క్లారిటీ ఇచ్చింది. కాగా వీరి వివాహం ఎప్పుడు జరగనుందనేది మాత్రం తెలపలేదు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.