Nayanthara : ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార తన అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. రీసెంట్‌గా వివాహం చేసుకున్న విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నయన్ భర్త విఘ్నేశ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీంతో నయన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు వారిలో ఎక్కడో అనుమానం కూడా రేకెత్తింది. ఎందుకంటే తమ అభిమాన నటికి పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలే అవుతోంది. నయనతార తల్లి అయ్యిందని తెలిసి సంతోషించే వారు ఎంత మంది ఉన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా కొత్త చర్చ నడుస్తోంది. నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమ వివాహం చేసుకుందని అందరికీ తెలుసు.
వీరిద్దరూ దంపతులుగా మారి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. అయితే, అప్పుడే వీరిద్దరూ ఎలా పేరెంట్స్ అయ్యారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.కానీ ఎవరినీ పిలువకుండా చేసుకున్నారు. వీరి పెళ్లి వీడియోలను నెట్ ఫ్లిక్స్ సంస్థ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంది. అయితే, తమ పెళ్లి దృశ్యాలను కూడా ఓటీటీకి నయన్ దంపతులు అమ్ముకోవడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. మరికొందరు మాత్రం బిజినెస్ ఎలా చేయాలో ఈ దంపతులకు బాగా తెలుసని కామెంట్స్ చేశారు. తాజాగా నయన్ దంపతులు పండంటి కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారని తెలియగానే అంతా షాక్ అవుతున్నారు. నయన్ ఓవైపు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.
గర్భం దాలిస్తే ఇప్పటికే జనాలకు తెలిసేది. కానీ అలాంటిది ఏమీ లేదు. గర్భం కనిపించకుండా ఎవరూ దాచలేరు. నయన్ పెళ్లికి ముందే కమిట్ అయ్యిందని అనుకుంటే అలియా భట్ లాగా రివీల్ చేసి తన బేబీ బంప్‌ను చూపించేది కదా.. అది కూడా జరగలేదు. మరి ఎలా తల్లి అయ్యిందని అందరికీ అనుమానం రావడంతో అసలు విషయాన్ని తన భర్త తెలిపాడు. తామిద్దరం సరోగసి ద్వారా పేరెంట్స్ అయ్యామని.. పెళ్లికి ముందే దీని గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నామని.. దాని ఫలితమే కవలపిల్లలు జన్మించారని పేర్కొనడంతో అంతా షాక్ అవుతున్నారు. గర్భం దాల్చకుండా నయన్ మాతృత్వం ఫీలింగ్ ఎలా పొందుతుందని.. గ్లామర్ దెబ్బతింటుందని ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.