Shah Rukh Khan : షారుఖ్ ఖాన్‌కు షాక్.. డ్రగ్స్ కేసులో కీలక మలుపులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్‌కు షాక్.. డ్రగ్స్ కేసులో కీలక మలుపులు..!

 Authored By mallesh | The Telugu News | Updated on :21 October 2021,6:20 pm

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న తన తనయుడు ఆర్యన్ ఖాన్‌ను చూసి షారుఖ్ తన ఇంటికి తిరిగి వచ్చే లోపు ఎన్‌సీబీ అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మొత్తంగా డ్రగ్స్ కేసు వ్యవహారం బీ టౌన్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్యన్ ఖాన్‌కు బలమైన ఉచ్చు బిగుసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేయగా, తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికి మూడు సార్లు పిటిషన్లు వేసినప్పటికీ ముంబై ప్రత్యేక కోర్టు వాటిని తిరస్కరిస్తూనే వస్తున్నది.

ncb officers raid on sharukh khan house

ncb officers raid on sharukh khan house

ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటున్నదనే అభిప్రయం వ్యక్తమవుతున్నది. ఇకపోతే షారుఖ్ ఖాన్ ఇంట్లో కూడా అధికారులు సోదలు చేయడం ద్వారా బలమైన సాక్ష్యాల కోసం ఎన్‌సీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు అవగతమవుతున్నది. ఆర్థర్ రోడ్డు నుంచి షారుఖ్ ఇంటికి వచ్చే లోపే మన్నాట్‌లో షారుఖ్ ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ పార్టీలో వాట్సాప్ చాటింగ్‌లో ఓ నటితో సంభాషించినట్లు అధికారులు సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీ టౌన్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే ఇంట్లో కూడా ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

Shah Rukh Khan : బీ టౌన్ యంగ్ హీరోయిన్ ఇంట్లోనూ సోదాలు.. విచారణకు రావాలని సమన్లు..

ncb officers raid on sharukh khan house

ncb officers raid on sharukh khan house

ఇకపోతే బెయిల్ పిటిషన్ తిరస్కరణల నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, ఈ నెల 26న సదరు పిటిషన్‌పై విచారణ జరగనుంది. మొత్తంగా తీగ లాగితే డొంక కదులుతున్న మాదరిగా ఆర్యన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో బీ టౌన్ సెలబ్రిటీల్లోనూ భయం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరయ్యే లోపే కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారం ఎన్‌సీబీ అధికారులు చేజిక్కించుకుంటారని తెలుస్తోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది